epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘ఎల్ నినో’ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి!

‘ఎల్ నినో’ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి!

– మండల ప్రత్యేక అధికారి వై శ్రీకాంత్ రెడ్డి పిలుపు
– త్రాగునీరు,పశుగ్రాస కొరత రాకుండా చర్యలు చేపట్టాలి
– అన్ని శాఖలు సమన్వయంతో పని చేసినపుడే కరువు పరిస్థితులకు చెక్

కాకతీయ,రాయపర్తి :

రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల ఎదురయ్యే వాతావరణ మార్పులు,కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు మండల యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి వై శ్రీకాంత్ రెడ్డి అధికారులకు పిలుపునిచ్చారు.శనివారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ…ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు,తాగునీటి ఎద్దడి,పశుగ్రాస కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.ముందస్తు ప్రణాళికతో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని ఆదేశించారు.ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చేతి పంపులు, బోర్ వెల్స్ కు తక్షణమే మరమ్మత్తులు చేయించాలని సూచించారు.వ్యవసాయ రంగంపై ఎక్కువ ప్రభావం పడుతున్నందున తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకుని భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు వి బి జి రామ్ జి (ఉపాధి హామీ పథకం) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు,ఫామ్ పాండ్స్ నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.రైతులు ప్రజలందరూ వీటిని నిర్మించుకునేం దుకుగాను విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.శాఖల మధ్య సమన్వయం లోపిస్తే సహించేది లేదని క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్,ఎంపీడీవో పాక శ్రీనివాసులు,ఏవో గుమ్మడి వీరభద్రం,ఎంపీఓ కూచన ప్రకాష్,ఇరిగేషన్ ఏఈ,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ,విద్యుత్ శాఖ ఏఈ,ఫీల్డ్ అసిస్టెంట్లు,ఉపాధి హామీ సిబ్బంది,వెటర్నరీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,ఏపీఓ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సమయపాలన పాటించని లక్షెట్టిపేట రెవెన్యూ సిబ్బంది.

  కాకతీయ,మంచిర్యాల జిల్లా: రెవిన్యూ అధికారులు స‌మ‌య పాల‌న పాటించ‌డం లేదు. మంచిర్యాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.