epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
విద్యతోపాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన అవసరం : మంత్రి సీతక్క
వెంకటాపూర్‌లో రూ.99 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

కాకతీయ, ములుగు : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు కేటాయిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం వెంకటాపూర్‌ మండల కేంద్రంలో రూ.99 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలను మంత్రి సీత‌క్క‌ ప్రారంభించారు. సీఆర్‌ఆర్‌ ప్లెయిన్‌ 2025–26 నిధులతో రూ.54 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సీఆర్‌ఆర్‌ ఎస్సీ ఉప ప్రణాళిక 2024–25 నిధులతో రూ.45 లక్షల వ్యయంతో మురుగునీటి కాలువల పనులు చేపట్టినట్లు తెలిపారు. గతంలో కాలనీలో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు పనులు మంజూరు చేశామని ప్రజల అవసరాలు, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో రహదారులు, మురుగునీటి కాలువలు, తాగునీటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవని నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అంతకుముందు వెంకటాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని చైర్మన్‌ శ్రీనివాస్‌, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

బాలల రక్షణపై అవగాహన తప్పనిసరి

గ్రామాల అభివృద్ధితోపాటు విద్యార్థుల విద్య, భద్రతకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. గురువారం గోవిందరావుపేట మండలం పసర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌’లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి సీత‌క్క‌ పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది విద్యేనని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని స్వశక్తితో ఎదగాలని సూచించారు. చదువుతోపాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన పెంచుకోవాలని, పాఠశాలల్లో, ప్రయాణాల్లో, ఇళ్ల వద్ద ఎదురయ్యే వేధింపులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మంచి స్పర్శ, చెడు స్పర్శ మధ్య తేడాను తెలుసుకోవడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో పోక్సో చట్టం, సైబర్‌ నేరాలు, బాలల అక్రమ రవాణా నివారణ, బాలల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడంతోపాటు మాట్లాడే బొమ్మ ద్వారా మంచి స్పర్శ, చెడు స్పర్శను వివరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోతు రవిచందర్‌, పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ బైరెడ్డి భగవాన్‌రెడ్డి, జిల్లా సహకార అధికారి రామ్మోహన్‌, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌!

యూత్‌ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌! బీజేవైఎం మండల అధ్యక్షుడు రాచర్ల రాజేష్‌...

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి!

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి! చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతల స్వీకరణ గ్రామానికి తొలిసారి...

జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు!

జంగాలపల్లి గుట్టకు పర్యాటక హంగులు! రామప్ప ఐలాండ్‌ అభివృద్ధికి రూ.13 కోట్లు గ్రామాల్లో పనుల...

రహదారి భద్రత, డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి!

రహదారి భద్రత, డ్రగ్స్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి! గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ...

పట్టభద్రులారా..! కాంగ్రెస్ భరతం పట్టండి

పట్టభద్రులారా..! కాంగ్రెస్ భరతం పట్టండి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటాలి ఓటరు నమోదు వేగవంతం...

కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు భరోసా

కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు భరోసా అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులు నమోదు కావాలి మాజీ ఎమ్మెల్యే,...

రూ.1.42 లక్షలు కట్టిస్తే.. బిల్లు రూ.80 వేలే!

రూ.1.42 లక్షలు కట్టిస్తే.. బిల్లు రూ.80 వేలే! మెడికవర్‌ బిల్లింగ్‌పై రోగి ఆవేదన రూ.62...

పీఆర్సీ కోసం పోరాటానికి సిద్ధం కావాలి!

పీఆర్సీ కోసం పోరాటానికి సిద్ధం కావాలి! నివేదిక బహిర్గతం చేసి వెంటనే అమలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.