స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం
నియోజకవర్గ కో- కన్వీనర్ జెల్ల ఉపేందర్
కాకతీయ, నెల్లికుదురు : వచ్చే నెల 22 న హనుమకొండ లోని కాలోజీ కళాక్షేత్రంలో జరగబోయే స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని స్వేరోలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని స్వేరో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమ నియోజకవర్గ కో- కన్వీనర్ జెల్ల ఉపేందర్ పిలుపునిచ్చారు గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఆత్మీయ సమ్మేళన గోడపత్రికలను స్వేరో జిల్లా అధ్యక్షులు బాషిపంగు మహేందర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఇండ్ల వెంకటేశ్వర్లు స్వేరోలు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమానికి మహానీయుల బాటలో పయనిస్తూ స్వేరో బిడ్డలను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా కృషిచేసి వందలాదిమంది జీవితాలను సక్రమ మార్గంలో నడుపుటకు నాంది పలికిన సుప్రీం స్వేరో డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ అడిషనల్ డిజిపి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న సందర్భంగా స్వేరోలు, ఆర్ఎస్పీ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరో గుండె రామనర్సయ్య, స్వేరో జిల్లా అధికార ప్రతినిధి సుధీర్, కో కన్వీనర్ గుజ్జునూరి నరేష్, ప్రజాసంఘాల నాయకులు ఇసంపల్లి సైదులు, దండెంపెల్లి సైదులు,గౌతమ్, మహేందర్, కరుణాకర్,హెచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

