epaper
Tuesday, November 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీసీఐ మేల్కోవాలి.. పత్తి రైతును కాపాడాలి!

సీసీఐ మేల్కోవాలి.. పత్తి రైతును కాపాడాలి!
పత్తి రైతు కష్టాన్ని వ్యాపారుల లాభాలకు బలి చేయొద్దు
కమర్షియల్ పద్ధతిలో కొనుగోలు చేయాలి
ప్రైవేటు దళారుల చేతిలో రైతు దోపిడీ.. కేంద్రం జోక్యం చేసుకోవాలి
క్వింటాకు రూ.12 వేలు ఇవ్వాల్సిందే.. తెలంగాణ రైతు సంఘం హెచ్చరిక
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : పత్తి రైతుల కష్టాన్ని ప్రైవేటు వ్యాపారుల లాభాలకు బలి చేయవద్దని, తక్షణమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కమర్షియల్ పద్ధతిలో కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిసిఐ వరంగల్ జనరల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఏడాది అనుకూల వాతావరణం లేక, సరైన వర్షాలు లేకపోవడంతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిందని, ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతుకు పెట్టుబడి కూడా రాని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతును ఆదుకోవాల్సిన కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు యంఎస్ పి కంటే ఎక్కువ ధర ఇస్తున్నట్లు చెబుతూనే, కొందరి పత్తికి మాత్రమే ఎక్కువ ధర ప్రకటించి మిగతా రైతులను క్వింటాకు రూ.1000 నుండి రూ.2000 వరకు తక్కువకు కొని దోచుకుంటున్నారని మండిపడ్డారు. యంఎస్ పి కంటే ఎక్కువ ధర ఉన్నప్పుడు సిసిఐ ఎందుకు కమర్షియల్ పద్ధతిలో కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వ సంస్థలు ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పత్తికి క్వింటాకు రూ.12 వేల ధర కల్పించాలని, నాణ్యత, తేమ పేరుతో ధరలు తగ్గించడంపై విచారణ జరిపాలని, పారదర్శక వేలం విధానం అమలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించి సిసిఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టకపోతే రైతులను ఐక్యం చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, ఉపాధ్యక్షులు ఊరాటి అంశాలు రెడ్డి, కోశాధికారి సిరుల రవీందర్, కత్తి సుధాకర్, బొల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి!

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి! నవంబర్‌ 6తో ఓటరు నమోదు గడువు...

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా?

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా? భారీ వాహనాల నియంత్రణ కోరుతూ నిరసన...

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే!

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే! దేవాదుల పంపులు ఎందుకు ఆన్‌ చేయలేదు? ప్రభుత్వంపై మాజీ...

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌!

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌! కాకతీయ, నెల్లికుదురు : గంజాయి,...

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు!

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు! కార్యకర్తల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం బీఆర్ఎస్ నేత‌ల‌పై...

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి!

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి! ఎన్నికల హామీని అమలు చేయడంలో...

ప్రజల భద్రత కోసమే కార్డెన్‌ సెర్చ్‌!

ప్రజల భద్రత కోసమే కార్డెన్‌ సెర్చ్‌! నేరాల నియంత్రణకు గ్రామాల్లో తనిఖీలు గుడుంబా తయారీపై...

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.