epaper
Wednesday, November 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అటవీశాఖలో అక్రమాల దందా!

అటవీశాఖలో అక్రమాల దందా!
కింది స్థాయి అధికారులపైనే వేటు
ఉన్నతాధికారులకు మినహాయింపెందుకు?
మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు ఘ‌ట‌న‌లో స‌స్పెన్ష‌న్ల వెనుక మ‌త‌ల‌బేంటి..?
చెట్ల నరికివేత నుంచి కలప రవాణా వరకు అక్రమాలు
నకిలీ అనుమతులతో మామిడి చెట్ల నరికివేత
ఆన్‌లైన్‌ వ్యవస్థను ఆసరాగా చేసుకుని అక్రమాలు
పర్యవేక్షణలో ఉన్నతాధికారుల వైఫల్యమా?
ఇద్దరు క్షేత్రస్థాయి అధికారుల సస్పెన్షన్‌తోనే విచారణ ముగిసినట్లా?
భీమునిపాద జలపాతం అభివృద్ధి నిధులపైనా అనుమానాలు
కాకతీయ, హ‌న్మ‌కొండ : మహబూబాబాద్‌ జిల్లాలో అటవీశాఖ వ్యవహారాలు వరుస వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణా, నకిలీ అనుమతుల సృష్టి, అభివృద్ధి పనుల నిధుల వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. బాధ్యులపై చర్యలు మాత్రం కింది స్థాయి అధికారులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గూడూరు మండలంలోని బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి, దామరవంచ ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ నిరభ్యంతర పత్రాలు, అనుమతులతో మామిడి చెట్లను నరికివేసి కలప తరలించిన వ్యవహారంలో ఇద్దరు క్షేత్రస్థాయి అధికారులు సస్పెండ్‌ కావడం తాజా పరిణామం. ఇదే సమయంలో భీమునిపాద జలపాతం అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల వినియోగంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు.. మరోవైపు వాటిని గుర్తించడంలో పర్యవేక్షణ వ్యవస్థ వైఫల్యం.. ఇంకోవైపు విచారణల్లో కింది స్థాయి సిబ్బందిపైనే చర్యలు.. వెరసి అటవీశాఖ ఉన్నతాధికారుల బాధ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
నకిలీ అనుమతులతో మామిడి చెట్ల నరికివేత
గూడూరు మండలం బ్రాహ్మణపల్లి, దామరవంచ గ్రామాల ఏజెన్సీ ప్రాంతాల్లో 2026 ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య నకిలీ నిరభ్యంతర పత్రాలు, అనుమతులను ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా సృష్టించి మామిడి చెట్లను నరికివేసి కలపను తరలించినట్లు అటవీశాఖ విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం, జిల్లా అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టగా.. అనుమతుల జారీకి సంబంధించిన ఆన్‌లైన్‌ వ్యవస్థను ఉపయోగించి అక్రమాలకు పాల్పడినట్లు విచారణ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.బ్రాహ్మణపల్లి ఘటనకు సంబంధించి గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి ఎం.ఆర్‌. పిచ్చేశ్వరరావు, దామరవంచ ఘటనకు సంబంధించి మాచర్ల ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ బి. శ్రీనుపై విచారణ జరిగింది. తమ పరిధిలో అక్రమ చెట్ల నరికివేత, కలప రవాణాను అడ్డుకోవడంలో విఫలమయ్యారని, కిందిస్థాయి సిబ్బందిపై సరైన పర్యవేక్షణ చేయలేదని విచారణ నివేదికల్లో పేర్కొన్నారు. ఇదే మామిడి క‌ర్ర‌ల అక్ర‌మ న‌రికివేత‌, త‌ర‌లింపు  వ్య‌వ‌హారంలో గూడూరు బీట్ ఆఫీస‌ర్ శ్రీధ‌ర్‌, మచ్చ‌ర్ బీట్ ఆఫీస‌ర్ పూల్‌సింగ్‌ల‌పై డీఎఫ్‌వో లావ‌ణ్య స‌స్పెన్ష‌న్ వేటు వేశారు.
ఉన్నతాధికారుల బాధ్యత ఏది?
ఈ వ్యవహారంలో భద్రాద్రి సర్కిల్‌ అటవీ సంరక్షణాధికారి డాక్టర్‌ డి. భీమా నాయక్‌ బుధవారం ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ (వర్గీకరణ, నియంత్రణ, అప్పీళ్లు) నిబంధనలు–1991లోని రూల్‌ 8 ప్రకారం క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే అక్రమాలు జరిగిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధికారులే కాకుండా వారి పైస్థాయి అధికారులు కూడా పర్యవేక్షణ బాధ్యత కలిగి ఉంటారు. స‌ద‌రు వ్యాపారులు ఉన్న‌తాధికారుల‌నే ముందుగా సంప‌ద్రించి అనుమ‌తి లేకుండానే చెట్ల న‌రికివేత‌కు మౌఖిక అనుమ‌తులు పొందిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఉన్న‌తాధికారుల ఆదేశాల‌తోనే క్షేత్ర స్థాయిలో ప‌నిచేసే అధికారులు అడ్డు చెప్ప‌లేద‌ని తెలుస్తోంది. ఈనేప‌థ్యంలోనే గూడూరు ఎఫ్ ఆర్ వో, ఎఫ్‌డీవోల‌పైనా ఎందుకు విచార‌ణ చేప‌ట్ట‌లేద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. అటవీశాఖలో అక్రమాలు జరిగిన ప్రతిసారీ క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నా, వాటిని అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారుల బాధ్యతపై మాత్రం స్పష్టత రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. డిప్యూటీ రేంజ్‌ అధికారి, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ తమ పరిధిలో పర్యవేక్షణ చేయలేదని విచారణ నివేదికలో పేర్కొన్నారు. మరి వారి పైస్థాయి అధికారులు తమ పరిధిలోని అటవీ ప్రాంతాలను ఎప్పుడు తనిఖీ చేశారు? అక్రమాలపై వారికి ముందస్తు సమాచారం ఉందా? సిబ్బంది పనితీరును సమీక్షించారా? నకిలీ అనుమతులు, కలప రవాణా వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయా? వెళ్లి ఉంటే ఏ చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు అవసరం. విచారణ కేవలం కింది స్థాయి సిబ్బందితోనే ఆగిపోకుండా, నిర్ణయాధికారులు, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించిన ఉన్నతాధికారుల పాత్రనూ పరిశీలించాలి. ఇంతకాలం చెట్ల నరికివేత, కలప రవాణా జరుగుతున్నా ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు రాలేదు? క్షేత్రస్థాయి తనిఖీలు ఎప్పుడు నిర్వహించారు? అక్రమాలను గుర్తించడంలో విఫలమైన పర్యవేక్షణ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేవలం ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేయడంతోనే బాధ్యత ముగిసినట్లా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
భీమునిపాద అభివృద్ధి నిధుల వినియోగంపై అనుమానాలు
భీముని పాదం వీడీసీ క‌మిటీకి  సంబంధించి రిజిస్ట్రార్ల‌లో.. క‌మిటీ స‌భ్యుల సంత‌కాలు ఫోర్జ‌రీ జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. తీర్మానాల‌కు సంబంధించి సంత‌కాలు.. బ్యాంకు రికార్డుల్లోని సంత‌కాల‌ను వెరిఫై చేస్తే అస‌లు విష‌యం వెలుగులోకి వ‌స్తుంద‌ని సూచిస్తున్నారు. గూడూరు మండలంలోని భీమునిపాద జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టిన పనులు, వాటికి కేటాయించిన నిధుల వినియోగంపైనా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయనే విమర్శలు రావడంతో పాటు వచ్చిన ఆదేశాలు, వాటి అమలుపైనా అనుమానాలు తలెత్తాయి. ఈ అంశంపై జిల్లా అటవీశాఖ అధికారి స్పందించి విచారణకు ఆదేశించారు. అయితే నిధులు ఎంత కేటాయించారు? ఎంత ఖర్చు చేశారు? పనులు క్షేత్రస్థాయిలో ఎంతవరకు పూర్తయ్యాయి?  బిల్లులు, తనిఖీ నివేదికలు ఉన్నాయా?  అనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. నిధుల వినియోగంపై విచారణకు ఆదేశించడం మాత్రమే కాకుండా, ఆర్థిక లావాదేవీలు, పనుల పురోగతి, పర్యవేక్షణ బాధ్యతలను కూడా సమగ్రంగా పరిశీలించాలి.
వరుస ఘటనలు.. పర్యవేక్షణ వ్యవస్థ ఏం చేస్తోంది?
గూడూరు మండలంలోని అటవీ ప్రాంతాల్లో కొంతకాలంగా చెట్ల నరికివేత, కలప తరలింపు ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా వాటిని ముందుగానే గుర్తించి అడ్డుకోవడంలో అటవీశాఖ యంత్రాంగం ఎంతవరకు పనిచేస్తోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. అటవీ ప్రాంతాలపై నిరంతర నిఘా ఉందా? బీట్‌, సెక్షన్‌, రేంజ్‌ స్థాయిలో తనిఖీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా? తనిఖీల్లో గుర్తించిన అక్రమాలపై పైస్థాయి అధికారులకు నివేదికలు అందుతున్నాయా? అందితే చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? అన్న అంశాలపై ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. అక్రమాలు జరిగిన తర్వాత విచారణలు చేపట్టి కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవడం కంటే, అవి జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కీలకం.
అసలు బాధ్యులెవరో తేలాలి
మామిడి చెట్ల నరికివేత, నకిలీ అనుమతుల వ్యవహారం, కలప రవాణా, భీమునిపాద జలపాతం అభివృద్ధి నిధుల వినియోగం.. ఈ అంశాలన్నింటినీ విడివిడిగా కాకుండా శాఖలోని పర్యవేక్షణ, పరిపాలనా వ్యవస్థతో అనుసంధానించి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌ అనుమతుల వివరాలు, కలప రవాణా పత్రాలు, క్షేత్రస్థాయి తనిఖీ నివేదికలు, నిధుల ఖర్చుకు సంబంధించిన బిల్లులు, కొలతల పుస్తకాలు, ఉన్నతాధికారుల సమీక్షల రికార్డులను పరిశీలించాలి. అక్రమాలకు పాల్పడినవారు, సహకరించినవారు, వాటిని గుర్తించడంలో విఫలమైన పర్యవేక్షణ అధికారులు ఎవరో తేల్చాలి. కేవలం కింది స్థాయి అధికారుల సస్పెన్షన్‌తో వ్యవహారాన్ని ముగించకుండా, బాధ్యత ఉన్నతస్థాయికి చేరేలా విచారణ సాగుతుందా? తప్పు చేసిన ఉన్నతాధికారులపైనా చర్యలు తీసుకుంటారా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉర్సు బైపాస్‌లో పెరుగుతున్న రోడ్డు ప్ర‌మాద‌లు

ఉర్సు బైపాస్‌లో పెరుగుతున్న రోడ్డు ప్ర‌మాద‌లు  ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి! పదేళ్లలో వందలాది...

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌!

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌! గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి, ఫారెస్ట్‌ సెక్షన్‌...

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి!

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ ఓటు...

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం త్వరలో తహసీల్దార్‌  భవనం పూర్తి...

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు 

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు  బురహాన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్  కాంగ్రెస్...

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి!

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి! రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా నమోదు ప్రక్రియ అర్హులంతా...

గీసుగొండ కాంగ్రెస్‌ పూర్తి కమిటీ ప్రకటన!

కాంగ్రెస్ పార్టీ మండల పూర్తి కమిటీ ప్రకటన... మండల కమిటీలో యువతకు ప్రాధాన్యత... మహిళా,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.