‘తెలంగాణ వంటిల్లు’ నూతన రెస్టారెంట్ ప్రారంభం
*రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య
కాకతీయ,ఏటూరునాగారం,రూరల్ : రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న ఝాన్సీరాణి ఏటూరునాగారం మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ వంటిల్లు’ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సీతక్క కుమారుడు, యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

