వెంకటమ్మ కుటుంబాన్ని పరామర్శించిన యాదవ రెడ్డి
కాకతీయ, నెల్లికుదురు: ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏలదండి వెంకట్ రెడ్డి తల్లి ఏలదండి వెంకటమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎదళ్ళ యాదవరెడ్డి ఆదివారం పరామర్శించారు.
ఈ సందర్భంగా ఏలదండి వెంకట్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ కష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కళావతి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,, ప్రభాకర్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, పొడెట్టి చంద్రయ్య, గండి మురళి, ముత్యాల లచయ్య ,వెంకట రెడ్డి, జగన్ బాబు, ముత్యాల వెంకన్న, గండేపల్లి రమేష్ ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

