మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి
కాకతీయ, నెల్లికుదురు: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదర్ ప్రశాంత్, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ బండారు వెంకటరమణ లు అన్నారు. మహబూబాబాద్‌కు చెందిన నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్, నేచర్ కేర్ ట్రస్ట్ చైర్మన్ బండారు శ్రీ వెంకట రమణ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాలు, పరిశ్రమల సంఖ్య పెరగడంతో పర్యావరణ కాలుష్యం తీవ్రంగా పెరుగుతోందని, అడవుల నరికివేత కారణంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఎల్‌నినో వంటి వాతావరణ పరిణామాలు కూడా మానవ మనుగడకు సవాలుగా మారుతున్నాయని పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేచర్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వీలైనన్ని మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించడమే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తోట లాలయ్య, మడత వెంకన్న, రామగిరి ఉపసర్పంచ్ సుమన్, గ్రామ పెద్దలు గొల్లపెల్లి ప్రభాకర్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ గుగులోత్ నాగమణి, అంగన్‌వాడీ టీచర్లు గుగులోత్ అరుణ, గుగులోత్ సునీత, మద్దెల సమ్మయ్య, రామగిరి సంతోష్, సంద కృష్ణ, గుర్రాల నరేష్, ఎడ్ల మహేష్, పోతరాజు శ్రీశైలం, పోతరాజు యాకన్న తదితరులు పాల్గొన్నారు.

