epaper
Monday, November 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గుడుంబా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం..

గుడుంబా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం..

*ఒకే రోజు ఆరు కేసులు నమోదు.. 54 లీటర్ల గుడుంబా స్వాధీనం..

*అక్రమ తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు..

*గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ హెచ్చరిక

కాకతీయ, గీసుగొండ: గుడుంబా అక్రమ తయారీ, విక్రయాలపై గీసుగొండ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఒకే రోజు ఆరు కేసులు నమోదు చేయడంతో పాటు 54 లీటర్ల నిషేధిత గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. మండలంలో గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 15న గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనపాక, గీసుగొండ గ్రామాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా గుడుంబా విక్రయిస్తున్న ఆరుగురిని పట్టుకున్నట్లు వెల్లడించారు. వీరిపై తెలంగాణ రాష్ట్ర నిషేధిత మద్య నియంత్రణ చట్టం కింద ఆరు కేసులు నమోదు చేసి, సుమారు రూ.13,500 విలువైన 54 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జనపాక గ్రామంలో నాలుగు కేసులు నమోదు చేసి 26 లీటర్లు, గీసుగొండ గ్రామంలో రెండు కేసులు నమోదు చేసి 28 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసుల్లో మూడూ విజయ (60), భర్త దాస్రు, ఆదర్శనగర్, స్తంభంపల్లి ఖిలా, వరంగల్ నివాసి, స్వగ్రామం రాములు తండా, గూడూరు మండలం; ధరావత్ విజయ (40), భర్త కుమార్, జనపాక గ్రామం; బోడ సురేష్ (30), తండ్రి బిచ్చ్యా, జనపాక గ్రామం; ఎల్లందుల రాకేష్ (30), తండ్రి నిర్మల్, గరీబ్‌నగర్, గొర్రెకుంట; పల్లకొండ సాంబరాజు (50), తండ్రి సైలూ, గీసుగొండ గ్రామం; పులిచెరి శైలజ (42), భర్త శ్రీను, గీసుగొండ గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. పట్టుబడిన నిందితులను స్థానిక తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి సత్ప్రవర్తన కోసం బైండోవర్ చేసినట్లు సీఐ వెల్లడించారు. గుడుంబా ఎక్కడ తయార వుతోంది,ఎక్కడి నుంచి గ్రామాలకు సరఫరా అవుతోంది అనే వివరాలను సేకరిస్తున్నామని,తయారీ దారులు,సరఫరాదారులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గుడుంబా విక్రయాలు ప్రజల ఆరోగ్యానికి, పేద, సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితికి తీవ్ర నష్టం కలిగిస్తాయని, ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఎవరైనా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా లేదా నిల్వ ఉంచినా వెంటనే పోలీసులకు 112 లేదా 8712685031 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, గుడుంబా రహిత గ్రామాల నిర్మాణానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని సీఐ విశ్వేశ్వర్ విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష!

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష! ఎన్రోల్మెంట్‌ నుంచే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు - ఉమ్మడి...

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు!

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు! టీయూడబ్ల్యూజే హెచ్‌-143 ఎన్నికల్లో పలువురికి...

రైతుల ధాన్యానికి భరోసా

రైతుల ధాన్యానికి భరోసా కాకతీయ, ఏటూరునాగారం : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు...

22న హనుమకొండకు కేటీఆర్‌..!

22న హనుమకొండకు కేటీఆర్‌..! వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్‌ నిర్ణయం ఏర్పాట్లపై...

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా!

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా! కేసు ఉపసంహరణపై ఒప్పందం..  మూడు గంటల చర్చల...

పేదలకు అండగా సంక్షేమ పథకాలు

పేదలకు అండగా సంక్షేమ పథకాలు చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేత ఎమ్మెల్యే మామిడాల...

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, ఆత్మకూర్‌ :...

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ 20 వినతులు స్వీకరణ.. పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇసుక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.