రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో హనుమకొండకు రన్నరప్
క్రీడాకారులు, కోచ్‌లకు అసోసియేషన్ ఘన స్వాగతం..సన్మానం
కాకతీయ, హనుమకొండ : రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర సాఫ్ట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో హనుమకొండ జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నెల 14, 15 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో జరిగిన పోటీల్లో ఫైనల్లో నిజామాబాద్ జట్టుతో హనుమకొండ జట్టు హోరాహోరీగా తలపడింది. చివరకు నిజామాబాద్ విజేతగా నిలవగా, హనుమకొండ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం రాత్రి హనుమకొండ బస్టాండ్‌కు చేరుకున్న జట్టుకు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. కార్యదర్శి తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి క్రీడాకారులతో పాటు కోచ్‌లు పోలేపాక వినయ్‌కుమార్, శివను పూలమాలలతో సత్కరించారు. నిరంతర శిక్షణతో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించగలరని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. శిక్షణ శిబిరానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు మధు, సృజన, సుష్మ, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

