epaper
Monday, November 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా!

నేటి నుంచి ఏనుమాముల మార్కెట్‌ యథావిధిగా!
కేసు ఉపసంహరణపై ఒప్పందం.. 
మూడు గంటల చర్చల అనంతరం ప్రకటన
ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావాలని మార్కెటింగ్‌ శాఖ విజ్ఞప్తి
కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. మంగళవారం నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగనున్నట్లు మార్కెటింగ్‌ శాఖ ప్రకటించింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావాలని కోరింది. అడ్తి సెక్షన్‌ ప్రెసిడెంట్‌ లింగారెడ్డిపై నమోదైన కేసు ఉపసంహరణ అంశంపై ఒప్పందం కుదరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మార్కెట్‌ ప్రధాన కార్యాలయంలోని చైర్‌పర్సన్‌ ఛాంబర్‌లో సమావేశం జరిగింది. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎర్ర ప్రియాంక అధ్యక్షతన మార్కెటింగ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ ఆర్‌. లక్ష్మణుడు, డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌. కిషోర్‌కుమార్‌, వ్యాపారులు, మార్కెటింగ్‌ అధికారులు చర్చల్లో పాల్గొన్నారు. కేసు ఉపసంహరణ, నోటీసులు, మార్కెట్‌ నిర్వహణ తదితర అంశాలపై చర్చించి ఒప్పందానికి వచ్చారు. అంతకుముందు సోమవారం ఉదయం మార్కెట్‌లో పత్తి, మిర్చి, అపరాలు, పసుపు యార్డులు బోసిపోయాయి. కేవలం రెండు, మూడు పత్తి ఆటోలు మాత్రమే యార్డుకు చేరుకున్నాయి. వ్యాపారుల నుంచి ముందస్తు సమాచారం అందడంతో రైతులు మార్కెట్‌కు రాలేదని తెలిసింది. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అధ్యక్షతన జరిగిన సమీక్షలోనూ మార్కెట్‌ యథావిధిగా కొనసాగుతుందని, రైతులకు ఇబ్బందులు కలగనివ్వమని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి 10.30 గంటల వరకు వ్యాపారులతో చర్చలు కొనసాగాయి. ఈ నెల 20న మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి కె. నాగరాజు, మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, సంబంధిత అధికారులు, వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష!

పట్టభద్రుల పోరు.. పార్టీలకు అగ్నిపరీక్ష! ఎన్రోల్మెంట్‌ నుంచే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు - ఉమ్మడి...

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు!

జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లలో వరంగల్‌ జర్నలిస్టులకు చోటు! టీయూడబ్ల్యూజే హెచ్‌-143 ఎన్నికల్లో పలువురికి...

రైతుల ధాన్యానికి భరోసా

రైతుల ధాన్యానికి భరోసా కాకతీయ, ఏటూరునాగారం : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు...

22న హనుమకొండకు కేటీఆర్‌..!

22న హనుమకొండకు కేటీఆర్‌..! వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్‌ నిర్ణయం ఏర్పాట్లపై...

పేదలకు అండగా సంక్షేమ పథకాలు

పేదలకు అండగా సంక్షేమ పథకాలు చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలు అందజేత ఎమ్మెల్యే మామిడాల...

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి

శ్రీ సిద్ధి లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి కాకతీయ, ఆత్మకూర్‌ :...

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ

గిరిజన దర్బార్‌కు విన‌తుల‌ వెల్లువ 20 వినతులు స్వీకరణ.. పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇసుక...

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌!

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్‌! రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల మందికి కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.