రైతుల ధాన్యానికి భరోసా
కాకతీయ, ఏటూరునాగారం : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి మద్దతు ధర పొందాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి, గోగుపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు శంకరాజుపల్లిలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, సహకార సంఘం చైర్మన్ కునూరు అశోక్‌గౌడ్ ప్రారంభించారు. గోగుపల్లిలో చిటమట రఘు, కునూరు అశోక్‌గౌడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.2,461, దొడ్డువడ్లకు రూ.2,441 మద్దతు ధర చెల్లించనున్నట్లు తెలిపారు. తూకంలో అక్రమాలకు తావులేకుండా, కొనుగోళ్లలో జాప్యం చేయకుండా ధాన్యం సేకరించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల డైరెక్టర్లు, రైతులు, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

