అచ్చ విద్యాసాగర్‌కు నాగుర్ల ఘన నివాళి
తెలంగాణ ఉద్యమ సహచరుడి మృతిపై సంతాపం
కాకతీయ, హన్మకొండ : తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అచ్చ విద్యాసాగర్ అకాల మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అచ్చ విద్యాసాగర్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అచ్చ విద్యాసాగర్‌తో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని, తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నామని నాగుర్ల వెంకటేశ్వర్లు గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. పార్టీ కష్టకాలంలోనూ అంకితభావంతో పనిచేస్తూ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలిచారని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమ కుటుంబానికి, ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితరులు నివాళులర్పించారు.

