ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి స్థానిక మండలంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం అశోక్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశ అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆమెకు ఉక్కు మహిళగా పేరు వచ్చిందని పేద బడుగు బలహీన వర్గాల కోసం పరితపించిన నేత ఇందిరా గాంధీ అన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, టౌన్ సర్పంచ్ ఫోరమ్ మండల అధ్యక్షులు తమ్మడపల్లి కుమార్, మాజీ మండలఅధ్యక్షులు సతీష్, టౌన్ గ్రామపార్టీ అధ్యక్షుడు, గంజి రవీందర్ రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు మామిడి జనార్ధన్, మీట్య తండా సర్పంచ్ చిన్ని వెంకన్న, లాల్ తండా సర్పంచ్ భూక్య వెంకన్న, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల మల్లేశం, ఏఎంసి డైరెక్టర్ రాము, కొణతం ప్రభాకర్, వార్డ్ మెంబెర్స్ నద్దునూరి ప్రశాంత్, నాగేల్లి సుధీర్, చీకటి అశోక్ , సలీం తదితరులు పాల్గొన్నారు.

