వరంగల్ చెత్తపై శాస్త్రీయ అధ్యయనం!
జీడబ్ల్యూఎంసీ–ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ సంయుక్తంగా వేస్ట్ ఆడిట్‌కు శ్రీకారం
90 ఇళ్లతో పాటు వాణిజ్య, ప్రభుత్వ సంస్థల్లోనూ సర్వే
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు శాస్త్రీయ అధ్యయనానికి జీడబ్ల్యూఎంసీ, చెన్నైకి చెందిన ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) గురువారం శ్రీకారం చుట్టాయి. వెల్‌కమ్ ట్రస్ట్ (యూకే) ఆర్థిక సహకారంతో, ఐఐటీ మద్రాస్, శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ భాగస్వామ్యంతో నాలుగేళ్ల పరిశోధన కార్యక్రమం చేపట్టారు. యూఎన్-హాబిటాట్ రూపొందించిన వేస్ట్ వైజ్ సిటీస్ టూల్ ఆధారంగా చెత్త ఉత్పత్తి, సేకరణ, పునర్వినియోగం, రీసైక్లింగ్, పారవేతను విశ్లేషించనున్నారు. వివిధ ఆదాయ వర్గాలకు చెందిన 90 ఇళ్లతో పాటు మార్కెట్లు, హోటళ్లు, పాఠశాలలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాల్లో సర్వే నిర్వహిస్తారు. ఈ నెల 19, 20 తేదీల్లో దివ్యదీప్తి భవన్‌లో స్వయం సహాయక సంఘాల సభ్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విద్యార్థి వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నారు. చెత్త పరిమాణం, వర్గీకరణ, తూకం, నమోదు పద్ధతులను నేర్పిస్తున్నారు. 15 రోజుల్లో క్షేత్రస్థాయి సమాచార సేకరణ, ఏడు వారాల్లో మొత్తం అధ్యయనం పూర్తి చేయనున్నారు. ప్రతి ఇంటి చెత్త పరిమాణం, రకాలను నమోదు చేసేందుకు శిక్షణ ఇస్తున్నామని జీడబ్ల్యూఎంసీ ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్ రాజా రెడ్డి తెలిపారు. ప్రజలు సర్వే బృందాలకు సహకరించాలని కోరారు. శాస్త్రీయ సమాచారం పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, మెరుగైన పారిశుద్ధ్య ప్రణాళికలకు దోహదపడుతుందని ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ ప్రతినిధి డాక్టర్ ప్రతిభ గణేషన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. మల్లం రాజేష్, డా. వెంకటేశ్వర్ రావు, డా. సబా, రాజమోహన్ రెడ్డి, ఓంప్రకాష్, అవినాష్, సాయి, అనురాధ, తనిషి, అరవింద్, హరీష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

