epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

త్వ‌ర‌లోనే స‌ర్పంచ్ ఎన్నిక‌లు

త్వ‌ర‌లోనే స‌ర్పంచ్ ఎన్నిక‌లు

3, 4 రోజుల్లో నోటిఫికేషన్‌
అభివృద్ధికి మద్దతుగా ఉండేవారినే ఎన్నుకోవాలి
ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌
వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటన
అక్షయపాత్ర ఫౌండేషన్‌ కిచెన్‌ను పరిశీల‌న‌
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: త్వరలోనే సర్పంచ్‌ ఎన్నికలు రాబోతున్నాయని.. మరో 3, 4 రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి రేవంత్‌ పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి అక్కడి ‘అక్షయపాత్ర ఫౌండేషన్‌ కిచెన్‌’ను పరిశీలించారు. మధ్యాహ్న భోజన కిచెన్‌ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈసంద‌ర్భంగా స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై మాట్లాడారు. కొడంగల్‌లో ఏ విద్యార్థీ ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 28 వేల మందికి ఉదయం అల్పాహారం (బ్రేక్​ఫాస్ట్​) అందిస్తున్నామని వెల్లడించారు. దీంతో ప్రభుత్వ బడుల్లో 5 వేల మంది విద్యార్థులు పెరిగారని ఆయన తెలిపారు.

ఎడ్యుకేషన్ హబ్​గా కొడంగల్‌

జీవితాల్లో మార్పు రావాలంటే పిల్లల్ని చదివించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్‌లో రూ.5 వేల కోట్లతో ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌ నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి సైనిక్‌ స్కూల్‌ను ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. 16 నెలల్లోగా కొడంగల్‌ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నామన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని పునరుద్ఘాటించారు. వెయ్యి ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులుగా చేశామన్నారు. సోలార్‌ పవర్‌ ప్లాంట్లు, పెట్రోల్‌ బంకులకు కూడా యజమానులను చేశామని చెప్పారు. అదానీ, అంబానీలతో పోటీపడేలా వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులు అమెజాన్‌లో అమ్ముకునేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణ నోయిడాగా కొడంగల్‌

మూడు నెలల్లో కొడంగల్‌లోని ప్రతి గ్రామానికి కృష్ణా నీళ్లు అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. లగచర్ల పారిశ్రామికవాడకు అంతర్జాతీయస్థాయి గుర్తింపు తీసుకొస్తామని వెల్లడించారు. తెలంగాణ నోయిడాగా కొడంగల్‌ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే కొన్ని నెలల్లో కొడంగల్‌ రైల్వే పనులు ప్రారంభమవుతాయన్న ఆయన నియోజకవర్గంలో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. త్వరలో సర్పంచ్‌ ఎన్నికలు రాబోతున్నాయని వివరించారు. మరో 3, 4 రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి అని రేవంత్‌ పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.