epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

252 జీవోను ప్ర‌భుత్వం స‌వ‌రించాలి

252 జీవోను ప్ర‌భుత్వం స‌వ‌రించాలి
జ‌ర్న‌లిస్టుల‌ అక్రిడేషన్ కార్డుల కోతను మానుకోవాలి
భ‌ద్రాద్రి క‌లెక్ట‌రేట్ ఎదుట జ‌ర్న‌లిస్టుల ధ‌ర్నా

కాకతీయ, కొత్తగూడెం : జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ప్రజాపాలన పేరుతో పాత్రికేయులను శిక్షించే ధోరణి అవలంబిస్తోందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే–టీజేఎఫ్ హెచ్143) నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని, జర్నలిస్టులను విభజించేలా ఉన్న 252 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కల్లోజీ శ్రీనివాస్, కార్యదర్శి మహమ్మద్ షఫీ, రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రం రాజేష్, చండ్ర నరసింహారావు, వట్టి కొండ రవి మాట్లాడుతూ… “జర్నలిస్టులపై ఎందుకీ కక్ష? ప్రజా పాలన పేరుతో మాకెందుకు శిక్ష?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్రిడేషన్ కార్డుల జారీలో కోత పెట్టడం ద్వారా ప్రభుత్వానికి మిగిలే కోట్లెన్ని అని ప్రశ్నించారు.

252 జీవోతో జర్నలిస్టులకు అన్యాయం

ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రిడేషన్ జీవో జర్నలిస్టుల మధ్య చీలిక తెచ్చేలా ఉందని నాయకులు విమర్శించారు. రెండు కార్డుల విధానానికి స్వస్తి పలకాలని, వర్కింగ్ జర్నలిస్టులందరికీ సమాన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన జర్నలిస్టుల గుర్తింపును రద్దు చేయడం అన్యాయమన్నారు. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు వంటి సంక్షేమ పథకాలు కూడా జర్నలిస్టులకు అమలు చేయాలని కోరారు. 252 జీవో సవరించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.

అల్లం నారాయణ హయాంలో జర్నలిస్టులకు భరోసా

గత ప్రభుత్వ హయాంలో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ ఉన్న సమయంలో జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు సంపూర్ణ న్యాయం జరిగిందని యూనియన్ నాయకులు గుర్తుచేశారు. కరోనా సమయంలో బాధిత జర్నలిస్టులకు ఆర్థిక సాయం, మృతి చెందిన జర్నలిస్టుల పిల్లల చదువులకు సహకారం అందించారని తెలిపారు. తెలంగాణలో అత్యధిక సంఖ్యలో అక్రిడేషన్ కార్డులు జారీ చేయించిన ఘనత అల్లం నారాయణదేనని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.