epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్యాలయాల ముఖచిత్రం మారాలి!

కార్యాలయాల ముఖచిత్రం మారాలి!
ఉద్యోగులకు మెరుగైన వసతులు తప్పనిసరి
ప్రభుత్వ భవనాల మరమ్మతుల‌పై ప్ర‌తిపాద‌న‌లు పంపండి
పర్యాటకుల కోసం హరిత హోటల్‌కు స్థలాన్ని సేక‌రించాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి .. జిల్లా కేంద్రంలో క్షేత్రస్థాయి తనిఖీలు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజాసేవల నాణ్యత పెరగాలంటే ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు అనుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. కార్యాలయ భవనాల మరమ్మత్తులు, మౌళిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. బస్‌డిపో రోడ్‌లోని డీఆర్డీఎ భవనం, ఆర్ & బీ ఇంజనీరింగ్ కార్యాలయం, బాల రక్షా భవనం, గిరిజన భవనం, ఆర్ & బీ గెస్ట్ హౌజ్‌తో పాటు ఇతర శాఖల కార్యాలయాల పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఉద్యోగులతో నేరుగా సంభాషణ

కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందితో నేరుగా మాట్లాడిన కలెక్టర్, మౌళిక వసతులు, పని వాతావరణం, ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవనాల స్థితిగతులు, మరమ్మత్తుల అవసరం, విద్యుత్, నీటి సౌకర్యాలు, పారిశుద్ధ్యం, ఫర్నిచర్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ఉద్యోగులకు తగిన మౌళిక సదుపాయాలు కల్పించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయ భవనాల మరమ్మత్తులు, అవసరమైన వసతుల కల్పనపై శాఖల వారీగా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి తక్షణమే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గిరిజన భవనం, గెస్ట్ హౌజ్‌ల అభివృద్ధి

గిరిజన భవనం, ఆర్ & బీ గెస్ట్ హౌజ్‌ల ప్రస్తుత పరిస్థితులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి భవనాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులకు అనుకూలమైన కార్యాలయ వాతావరణమే సమర్థవంతమైన పాలనకు ఆధారమని తెలిపారు. అనంతరం జిల్లాకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం నిర్మించనున్న హరిత హోటల్‌కు అనువైన స్థలం గుర్తించే దిశగా కలెక్టర్ చర్యలు చేపట్టారు. ఖమ్మం కేంద్రంలోని ఎన్ఎస్పీ క్యాంప్‌తో పాటు పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సైదులు, సర్వేయర్లు నాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.