epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!

కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి..!
సంక్రాంతి వేళ రైతులకు నిరాశే మిగిలింది
బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు కట్ చేస్తారా?
జర్నలిస్టుల అరెస్టులు కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనం
రైతుబంధు–రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం

కాకతీయ, జహీరాబాద్ : సంక్రాంతి పేరులోనే క్రాంతి ఉందని, తెలంగాణ ప్రజలకు విప్లవాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు ముందు ఉద్యమ క్రాంతి, టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి క్రాంతి జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పోరాటాల క్రాంతి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
సంక్రాంతి లాంటి ఆనందపు పండుగ వేళ అన్నదాతలను ఆందోళనలోకి నెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్శించారు. రైతు రుణమాఫీ నుంచి యూరియా దాకా రైతులను ఇబ్బందుల పాలుచేస్తోందని ఆరోపించారు. సగానికి సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదని, ఎండకు, చలికి లైన్లలో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. యాప్‌లు, మ్యాప్‌లు, కార్డుల పేరుతో రైతుల ఉసురు తీసుకుంటున్నారని మండిపడ్డారు.

రైతు బాంధవుడు కేసీఆర్

కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు వేసి రైతు బాంధవుడిగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని హరీష్ రావు గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి 73 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, చెరువులు–ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించినది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అంటూనే 12 గంటలే ఇస్తోందని, రెండు పంటలకు రైతుబంధు, ఒక పంటకు బోనస్ ఇచ్చి మరోదానికి ఎగ్గొట్టిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి బండ్లపై చలాన్లు పడితే బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా డబ్బులు కట్ చేయాలని చెప్పడం ప్రమాదకరమని అన్నారు. ప్రజలకు తెలియకుండా ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేవాళ్లను సైబర్ నేరగాళ్లు అంటారని, ఇప్పుడు రేవంత్ రెడ్డికి వారికి పెద్ద తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల వేళ ఓట్ల కోసం చీరలు, రైతుబంధు పంచుతారని విమర్శిస్తూ.. కేసీఆర్ నాట్లకు నాట్లకు రైతుబంధు, బతుకమ్మకు చీరలు ఇచ్చారని తేడాను స్పష్టం చేశారు.
జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. మీడియాను బ్లాక్‌మెయిల్ చేయడం, ప్రశ్నించే గొంతులను అణిచివేయడం కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు, ఎస్సీ–ఎస్టీ కేసులు బనాయిస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.