epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసీఆర్‌ తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక: కేటీఆర్‌

కేసీఆర్‌ తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక: కేటీఆర్‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ చేసిన పోరాటం, త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పంతో 2001లో గులాబీ జెండా ఎగురవేసిన సమయంలో పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నాయో గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, మరోవైపు శతాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ వంటి బలమైన రాజకీయ శక్తులు ఉన్నప్పటికీ, మీడియా శక్తి లేకుండా, ఆర్థిక బలం లేకుండా, కులబలం లేకుండా, కేవలం తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేసీఆర్‌ ధైర్యంగా ముందుకు వచ్చారని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ చూపిన సాహసం దుస్సాహసంతో సమానమని, తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే ధర్మబలం, సంకల్పమే ఆయనను ముందుకు నడిపించాయని కేటీఆర్‌ అన్నారు. పద్నాలుగు సంవత్సరాల ఉద్యమంలో కేసీఆర్‌ చేసిన త్యాగాలు, ప్రజలతో కలిసి నడిచిన పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని పేర్కొన్నారు. అనంతరం పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అద్భుతంగా నడిపించి, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపారని తెలిపారు. ఢిల్లీలో ప్రముఖ నాయకులు కూడా కేసీఆర్‌ను ఉత్తమ ఉద్యమకారుడిగా, ఉత్తమ పరిపాలకుడిగా ప్రశంసించారని గుర్తుచేశారు.
ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తెలంగాణ మట్టితో మమేకమైనవారికి మాత్రమే తెలంగాణ జాతి గౌరవం విలువ తెలిసుంటుందని కేటీఆర్‌ అన్నారు. ఉద్యమ సమయంలో నిరాహార దీక్షలు చేసిన నాయకుడు, లాఠీ దెబ్బలు తిన్న కార్యకర్తలు, జైళ్లకు వెళ్లిన ఉద్యమకారులు మాత్రమే జాతి గౌరవం అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో పాల్గొనని వారు జాతి గురించి మాట్లాడటానికి అర్హులు కారని విమర్శించారు.
తెలంగాణ జాతి చరిత్ర గొప్పదని, రాణి రుద్రమదేవి, కుమరం భీం, సమ్మక్క-సారలమ్మ, సర్వాయి పాపన్న, సాకలి ఐలమ్మ, దాశరథి వంటి మహనీయుల వారసత్వాన్ని కలిగిన జాతి తెలంగాణదని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రజలు బానిసలు కారని, నిటారుగా నిలబడి పోరాడే భూమిపుత్రుల జాతి అని స్పష్టం చేశారు. తెలంగాణలో రెండు జాతులే ఉన్నాయని, ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండోది తెలంగాణ ద్రోహుల జాతి అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను ప్రజలే జాతిపితగా గౌరవిస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్‌ తనను తాను ఎప్పుడూ జాతిపితగా ప్రకటించుకోలేదని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు స్వీయ గౌరవాన్ని అందించిన నాయకుడిగా ప్రజలే ఆయనను ఆ స్థాయికి చేర్చారని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం స్వయంగా కేసీఆర్‌ కృషికి నిదర్శనమని, ఆయన ఆనవాళ్లను ఎవరూ చెరిపివేయలేరని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్‌ చేసిన సేవలు తెలుసని, తెలంగాణ ఆత్మగౌరవానికి ఆయన శాశ్వత ప్రతీకగా నిలిచిపోతారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.