epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక ర్యాంపుల్లో దోపిడీ దందా..!

ఇసుక ర్యాంపుల్లో దోపిడీ దందా..!
లోడింగ్ పేరుతో ఒక్కో లారీపై రూ.7,000 వరకు అక్రమ వసూళ్లు
డీడీ చెల్లించినప్పటికీ అదనపు చార్జీలతో లారీ యజమానులపై భారం
కాంట్రాక్టర్ల దౌర్జన్యంపై మండిపడుతున్న లారీ అసోసియేషన్లు
టీజీఎండీసీ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు
గనులు, భూగర్భ శాఖ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు
అక్రమ రవాణా లారీలను బ్లాక్‌లిస్ట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
పెద్ద అంబర్‌పేట ఇసుక లారీ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ భాస్క‌ర్ గౌడ్

కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఇసుక ర్యాంపుల్లో కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ పెద్ద అంబర్‌పేట ఇసుక లారీ యజమానుల సంఘం అధ్య‌క్షుడు భాస్క‌ర్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో లారీ య‌జ‌మానులు రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
టీజీఎండీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక లోడింగ్ ప్రక్రియలో నిబంధనలు తుంగలో తొక్కి లారీ యజమానుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని సంఘం నాయకులు ఆరోపించారు. ఈసంద‌ర్భంగా భాస్క‌ర్ గౌడ్ మాట్లాడుతూ..! లారీ యజమానులు టీజీఎండీసీకి డీడీ రూపంలో ఇప్పటికే రూ.15,250 వరకు చెల్లిస్తున్నప్పటికీ, కాంట్రాక్టర్లు అదనంగా లోడింగ్ పేరుతో ఒక్కో లారీ నుంచి రూ.2,500 నుంచి రూ.3,000 వరకు అక్రమంగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం లోడింగ్ ఖర్చుల కోసం సుమారు రూ.3,500 చెల్లిస్తున్నప్పటికీ, కాంట్రాక్టర్లు రెండు వైపులా వసూళ్లు చేస్తూ ఒక్కో లారీపై మొత్తం రూ.6,000 నుంచి రూ.7,000 వరకు దోచుకుంటున్నారని ఆరోపించారు.

జిల్లాల వారీగా అక్రమ వసూళ్ల జాబితా

పలుజిల్లాల్లో కాంట్రాక్టర్లు వివిధ పేర్లతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంఘం వివరించింది. ములుగు జిల్లాలో లోడింగ్, పట్టా, జేసీబీ, ఇతర చార్జీల పేరుతో రూ.3,700 వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ఈ మొత్తం రూ.3,900 వరకు చేరుతుండగా, నల్గొండ జిల్లా వంగమర్తి ర్యాంపులో రూ.2,400 వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, చర్ల ప్రాంతాల్లో రూ.2,000 వరకు, భూపాలపల్లి జిల్లాలో రూ.3,600 వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ విధంగా ప్రతి ర్యాంపులో రోజుకు లక్షల రూపాయల అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు.

లారీ యజమానులపై వేధింపులు, దాడులు

లోడింగ్ చార్జీలపై ప్రశ్నించిన లారీలను కావాలనే పక్కకు పెట్టి లోడింగ్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లపై దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. టీజీఎండీసీ అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను గుర్తించి వెంటనే బ్లాక్‌లిస్ట్ చేయాలని సంఘం డిమాండ్ చేసింది. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఇసుక సరఫరా ప్రక్రియలో పారదర్శకతను తీసుకువచ్చి, లారీ యజమానులపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని పెద్ద అంబర్‌పేట ఇసుక లారీ యజమానుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఫిర్యాదు చేసిన వారిలో లారీ అసోసియేష‌న్ ప్రధాన కార్యదర్శి రవీందర్, ఉపాధ్యక్షులు బలరాం గౌడ్, నర్సింహా, సభ్యులు శ్రీను, యాదగిరి, నర్సింహా, కుమార్, శేఖర్, అశోక్, శ్రీశైలం, సతీశ్, స్వామి, మునుకుంట్ల నర్సింహా, వెంకన్న తదితరులు ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.