epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?
మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా..
ఎమ్మెల్యేల మెడలు పట్టి గెంటేస్తారా?
ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగించడం దుర్మార్గం
బీఆర్‌ఎస్‌ లేకుండా సభ నడపడం ప్రజాస్వామ్యమా?
22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది?
ఎన్ని కుట్రలు చేసినా ప్రజల సమస్యలపై పోరాటం ఆపం
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం ఉపనేత హరీశ్‌రావు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం ఉపనేత హరీశ్‌రావు ప్రశ్నించారు. మహిళా శాసనసభ్యుల చీరెలు లాగడం, ఎమ్మెల్యేల మెడలు పట్టి గెంటేయడం, ప్రజాప్రతినిధులపై పోలీసులను ప్రయోగించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో సోమవారం జరిగిన పరిణామాలు బ్లాక్‌ డేగా మిగిలిపోతాయని అన్నారు. మహిళా సభ్యుల చీరెలు లాగిన పోలీసులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌ వద్ద హరీశ్‌రావు మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యులను మాట్లాడకుండా అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, పింఛన్లు, ఫీ రీయింబర్స్‌మెంట్‌, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై సభలో మాట్లాడితే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతో తమపై పోలీసులను ప్రయోగించారని ఆరోపించారు.

మహిళా సభ్యులపై దాడులను మరిచిపోం

మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషంగా, అమానవీయంగా ఉందని హరీశ్‌రావు అన్నారు. మహిళా శాసనసభా నాయకుల చీరెలు లాగుతారా, వారి పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. సునితమ్మ చీర లాగిన పోలీసులు, సబితమ్మ గొంతు నొక్కిన పోలీసులు, జగదీష్‌రెడ్డి గారిని కిందపడేసిన వారిని ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల చర్యల్లో పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారని హరీశ్‌రావు తెలిపారు. కేటీఆర్‌ చేయి, ముఖంపై గీరుకుపోయిందని, యాదవ్‌రెడ్డి కుడికాలు గోరు పోయిందని, రాజశేఖర్‌రెడ్డి కాలు కమిలిపోయిందని, సంజయ్‌ చేయికి దెబ్బ తగిలిందని వివరించారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఈ ఘటనలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

సభ నుంచి మమ్మల్ని ఎందుకు బయటకు పంపారు?

ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం ఎందుకు పారిపోతోందని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్‌ మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకొని 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అంశాలపై నామమాత్రపు చర్చకు పరిమితం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ లేకుండా సభలో చర్చ జరపడం ప్రజాస్వామ్యం కాదన్నారు. తమను సస్పెండ్‌ చేయడానికి పథకం ప్రకారం కుట్ర చేశారని విమర్శించారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ నల్ల టీషర్టులు ధరించి పార్లమెంట్‌కు వెళ్లి నిరసన తెలిపిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. అక్కడ నిరసనలకు అవకాశం ఉన్నప్పుడు తెలంగాణలో మాత్రం ప్రజల తరఫున నిరసన తెలుపుతున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తాము రేవంత్‌రెడ్డిలా బడివే అనలేదని, పైల్వాన్లు ఉన్నారని, కొడతారని బెదిరించలేదని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతున్నామని స్పష్టం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై సమాధానం చెప్పాలి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను 3 ఏళ్లుగా చెల్లించడం లేదని హరీశ్‌రావు అన్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, వందలాది మంది ప్రభుత్వానికి వినతులు ఇస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు చేయలేకపోతున్నామని, ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 22ఏ భూముల సమస్యతోపాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశంపై ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి బీఆర్‌ఎస్‌ను సభలో లేకుండా చేసేందుకు మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేశాయని, ఒక పథకం ప్రకారం కుట్ర చేశాయని హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా 22ఏ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వైఫల్యాలపై పోరాటాన్ని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్కాంలు, వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే తమను సభ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. తమ మహిళా సభ్యులపై జరిగిన దాడిని చూస్తూ ఊరుకునేది లేదని హరీశ్‌రావు అన్నారు. ఒక మహిళా సభ్యురాలి గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోవాలా, ఒక అక్క గొంతు పిసికితే చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చ జరపడం అంటే ప్రభుత్వం తప్పు చేసినట్లేనని అన్నారు. తప్పు చేయకపోతే సంబంధిత అంశాలను ఎందుకు సభ ఎజెండాలో పెట్టడం లేదని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు, కుట్రలు ఎదురైనా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, చివరకు ప్రజాక్షేత్రంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హరీశ్‌రావు అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.