epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నీటి ఎద్ద‌డి రావొద్దు

నీటి ఎద్ద‌డి రావొద్దు

వేసవిలో తాగునీటి సరఫరా పటిష్టం

క‌రీంన‌గ‌ర్ మేయర్ కొలగాని శ్రీనివాస్

నీటి శుద్ధీకరణ కేంద్రం పరిశీల‌న‌

లీకేజీల మరమ్మతులు, సమ్మర్ యాక్షన్ ప్లాన్ ..

విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ : వేసవి కాలంలో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నగరంలోని మానేరు డ్యాం సమీపంలోని నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన సందర్శించి పంపుహౌజ్‌లు, మోటార్ పంపుల పనితీరు, నీటి శుద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి శుద్ధీకరణ కేంద్రంలో వాల్వ్ లీకేజీలు, మోటార్ పంపుల మరమ్మతులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హై లెవల్ రిజర్వాయర్, సంప్, మోటార్ పంపులను తనిఖీ చేసి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంతో పాటు విలీన గ్రామాల ప్రజలకు ప్రతిరోజు త్రాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొత్తగా విలీనమైన గ్రామాల్లో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు చెప్పారు.

రూ.49 లక్షల నిధులు

మానేరు డ్యాం నీటిమట్టం 7 టీఎంసీలకు చేరిన నేపథ్యంలో అదే స్థాయి నిల్వ కొనసాగించేలా ఇరిగేషన్ అధికారులకు సూచించినట్లు మేయర్ తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.49 లక్షల నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి విలీన గ్రామాలకు అద్దె బావులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని తెలిపారు. అమృత్-2 పథకం ద్వారా పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని, ఫిల్టర్ బెడ్‌లలో క్లోరినేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించి సురక్షిత నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్రణాళిక అమలు విషయంలో అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మానేరు డ్యాంలో నీటిమట్టం తగ్గడంతో ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోందని, త్వరలో నాలుగు బూస్టర్ పంపులను ప్రారంభించి నీటి సరఫరాను మెరుగుపరుస్తామని తెలిపారు. వేసవి దృష్ట్యా ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మాసం గణేష్, డీఈ దేవేందర్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.