నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ
దాసరి స్వామి వైద్యానికి రూ.3 లక్షల సాయం
నిమ్స్‌లో ఆపరేషన్‌కు రూ.5 లక్షల ఖర్చు
కాకతీయ, రుద్రంగి : నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన దాసరి స్వామి గత ఐదు, ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆపరేషన్‌కు సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న స్వామి కుటుంబం తమ సమస్యను మానాల మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.3 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఈ నేపథ్యంలో ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఆపద సమయంలో ఆర్థిక సాయం అందేలా కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మానాల మోహన్‌రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మానాల ఉపసర్పంచ్ దాసరి అశోక్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సాయం అందేలా ప్రజాప్రతినిధులు, నాయకులు చొరవ తీసుకోవాలని కోరారు.

