epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు
చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు
కోర్టు కేసులున్నా నిర్మాణాలు
ప్రగతినగర్ స్మశానవాటికను కాపాడాలంటూ విన్నపాలు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రజావసరాలకు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు సమర్పించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధుల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్‌లో ప్రజావసరాల కోసం కేటాయించిన సుమారు 5 ఎకరాల శ్మ‌శానవాటిక స్థలం కబ్జాకు గురవుతోందని స్థానిక నివాసితులు ఆరోపించారు. ఆలేటి శ్రీనివాసరావు, జశ్వంత్ తదితరులు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ, శ్మ‌శానవాటికకు ఆనుకుని ఉన్న దాదాపు 4 ఎకరాల చెత్త డంపింగ్ యార్డు ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలోకి వెళ్లిందని పేర్కొన్నారు. సర్వే అధికారులు దీనిని నిర్ధారించారని, హైడ్రా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బాచుపల్లి పెద్దకుంట… ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలు

బాచుపల్లి పెద్దకుంట చెరువు ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో శ్మ‌శాన వాటిక నిర్మాణం కొనసాగుతోందని శిఖర రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ నిర్మాణాలు ఆగడం లేదని ఆరోపించింది. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలోని పోచమ్మ దేవాలయానికి చెందిన భూమిలో అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టారని స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో పనులు తాత్కాలికంగా ఆగాయని, అయితే విషయం కోర్టులో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణ యత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

అమీన్‌పూర్‌లో పోచమ్మకుంటలో కూడా ఇదే పరిస్థితి

అమీన్‌పూర్ సర్వే నంబర్ 971లోని పోచమ్మకుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో స్మశానవాటిక నిర్మాణం జరుగుతోందని మరో ఫిర్యాదు అందింది. చెరువుల పరిరక్షణకు హైడ్రా కఠిన చర్యలు తీసుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఎస్‌బీఆర్ కాలనీలో 25 అడుగుల రహదారిని సుమారు 5 అడుగుల మేర ఆక్రమించి షాపులు నిర్మించారని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో అంబులెన్స్‌లు, పాఠశాల బస్సులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఆక్రమణలో నిర్మించిన షట్టర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.

హైడ్రా స్పందన

హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య ఫిర్యాదులను పరిశీలించి, సమస్యల పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్రజావసరాల భూములు, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధి, రహదారుల పరిరక్షణపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఈ 42 ఫిర్యాదులు నగర పరిసర ప్రాంతాల్లో భూఆక్రమణలు ఎంత తీవ్రమైన స్థాయిలో ఉన్నాయో స్పష్టంచేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.