epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
కాంగ్రెస్ హామీల అమలుపై చర్చకు సిద్ధం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక వర్క్‌షాప్
పార్లమెంటరీ విధానాలపై నేతల మార్గనిర్దేశం
ప్రజా సమస్యలను బలంగా ప్రస్తావిస్తాం
సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వ్యూహం
మాజీ స్పీకర్, నిపుణుల సూచనలు తీసుకున్నాం
బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలు, నిరంతరం జరుగుతున్న అరాచకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయడానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో మంగ‌ళ‌వారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, సభా నియమ నిబంధనలు (రూల్ బుక్), రాజ్యాంగ సంబంధిత అంశాలపై కూడా అవగాహన కల్పించారు. శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తదితర సీనియర్ నేతలు వేర్వేరు సెషన్లలో మాట్లాడారు. వర్క్‌షాప్ ముగింపు సెషన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. అనంత‌రం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాబోయే బడ్జెట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంగళవారం ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. సభలో ఎలా మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి, బడ్జెట్‌పై ఎలా స్పందించాలి అనే అంశాలపై సభ్యులకు పార్లమెంటరీ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై సభలో ఎలా చర్చించాలి అనే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు చెప్పారు. బడ్జెట్‌లోని అంకెలను ఎలా విశ్లేషించాలి, ప్రభుత్వ ఖర్చులను ఎలా ప్రశ్నించాలి అనే విషయాలపై కూడా నేతలు ఎమ్మెల్యేలకు సూచనలు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. రాబోయే సమావేశాల్లో ప్రజల సమస్యలను బలంగా ప్రస్తావించాలనే దిశగా వ్యూహం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

పార్లమెంటరీ విధానాలపై సూచనలు

ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పార్లమెంటరీ విధానాలపై సభ్యులకు వివరించినట్లు కేటీఆర్ చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా, అనంతరం మండలి డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవాలను ఆయన సభ్యులతో పంచుకున్నారని తెలిపారు. మాజీ స్పీకర్, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి కూడా సభా వ్యవహారాలపై తన అనుభవాలను వివరించినట్లు చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శాసనసభలో ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించేవారో కూడా ఎమ్మెల్యేలకు వివరించారని పేర్కొన్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితర నేతలు కూడా సమావేశంలో పాల్గొని సభ్యులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు, ప్రజా సమస్యలను ఎలా లేవనెత్తాలనే విషయాలపై సూచనలు ఇచ్చారని చెప్పారు. మాజీ శాసన మండలి సభ్యుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా సమావేశంలో పాల్గొని బడ్జెట్‌లోని ఆర్థిక అంశాలను ఎలా విశ్లేషించాలి అనే విషయాలను వివరించినట్లు తెలిపారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు లోపాలు, రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలను బలంగా ప్రస్తావించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని సమావేశాలు నిర్వహించి సభ్యులను మరింత సిద్ధం చేస్తామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.