epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య

కరీంనగర్‌లో విషాదం..
భార్య మృతి తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య
మూడు రోజుల వ్యవధిలో దంపతుల మృతి
జమ్మికుంటలో కలకలం రేపిన ఘటన
అత్తగారింట్లో ఉరి వేసుకున్న ఎస్సై చంద్రశేఖర్
గదిలోకి వెళ్లి బయటకు రాకపోవడంతో అనుమానం
తలుపులు బద్దలు కొట్టి చూడగా మృతదేహం గుర్తింపు
అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు

కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భార్య మృతిని తట్టుకోలేక పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తగారింట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. చంద్రశేఖర్ యాదవ్ ఇంటికి వచ్చిన అనంతరం డ్రెస్ మార్చుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లారు. చాలా సేపు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. పలుమార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆయన ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భార్య  ఆత్మహత్య.. మానసిక వేదన

ఇటీవల జరిగిన మరో విషాదం ఈ ఘటనకు కారణంగా నిలిచింది. రెండు రోజుల క్రితం చంద్రశేఖర్ యాదవ్ భార్య దివ్య కడుపునొప్పిని తట్టుకోలేక విషపదార్థం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో కుటుంబం ఇప్పటికే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్య మృతిని చంద్రశేఖర్ యాదవ్ తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు రోజులుగా ఆయన మౌనంగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం గమనించామని చెప్పారు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన ఆయన చివరకు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అనాథలుగా ఇద్దరు పిల్లలు..

వరుసగా జరిగిన ఈ రెండు మరణాలు స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. దంపతుల మృతితో ఇద్దరు చిన్న పిల్లలు అనాథలుగా మిగిలారు. వారి భవిష్యత్‌పై కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబంలో వరుసగా జరిగిన ఈ విషాద ఘటనపై స్థానికులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు, మానసిక ఒత్తిడి వంటి అంశాలపై కూడా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన మరోసారి మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరాన్ని గుర్తుచేస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఇలాంటి పరిస్థితుల్లో మానసికంగా బాధపడుతున్న వారిని గమనించి సహాయం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.