epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి

అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి
కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట
బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి

కాకతీయ, గజ్వేల్ : ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని ఈద్గా, ప్రజ్ఞాపూర్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటూ, రంజాన్ పండుగ క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి శాంతి, సిరిసంపదలు, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. ఈద్గాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

కేసీఆర్ ప్ర‌భుత్వంలో మైనార్టీల‌కు న్యాయం

గత కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు. షాదీ ముబారక్ ద్వారా పేద కుటుంబాలకు అండగా నిలిచామని, ఇమామ్‌లు, ముజ్జిన్‌లకు గౌరవ వేతనాలు అందించినట్లు తెలిపారు. రంజాన్ తోఫాలు, ఇఫ్తార్ విందుల ద్వారా మైనార్టీలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో దాదాపు 10 వేల కోట్ల రూపాయలతో మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, స్వయం ఉపాధి కోసం వేలాది మందికి శిక్షణ, వాహనాలు అందించామని పేర్కొన్నారు. 3310 మందికి విదేశీ విద్య కోసం స్కాలర్షిప్‌లు అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ గురుకులాలు, జూనియర్ కళాశాలల ద్వారా లక్షలాది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని, గజ్వేల్ ప్రాంతంలో దాదాపు రూ.20 కోట్లతో మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. మదీనా మస్జిద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్, షాదీ ఖానా నిర్మాణం, ఈద్గాలకు స్థలాల కేటాయింపు, మహిళలకు 420 కుట్టుమిషన్ల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. రంజాన్ తోఫాల పంపిణీలో పారదర్శకత లేకుండా వ్యవహరిస్తోందని, పేద ముస్లింలను విస్మరిస్తోందని మండిపడ్డారు. మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకుని మైనార్టీలకు సమాన న్యాయం చేయాలని, వారి సంక్షేమానికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, రాష్ట్ర నాయకులు విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీర్, మాజీ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.