epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర

లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర

యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం అడ్డంకులు

తమవారికే కొలువులు ద‌క్కేలా జీవో నంబర్ 4

హీహెచ్డీకి 25 మార్కులు వెయిటేజ్ కుట్రలో భాగమే..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: గ్రూప్ -1 తరహాలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను తమవారికి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు దక్కకుండా జీవోల పేరుతో ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కవిత మండిపడ్డారు. ప్రభుత్వం ఏ నోటిఫికేషన్ వేసిన సరే దానికి ఒక జీవో అడ్డంకిగా మారిందన్నారు. ముఖ్యంగా డిగ్రీ లెక్చరర్ల పోస్టుల కోసం వేసిన నోటిఫికేషన్ కు అడ్డుగా జీవో నంబర్ 4 తెచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ లెక్చరర్ల పోస్టుల నియామకాల్లో కుట్ర జరుగుతోందని చెప్పారు. గ్రూప్-1 లో తాము అనుకున్న వారికే ఉద్యోగాలు ఇచ్చేలా ప్రత్యేక ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టి కుట్ర చేశారని గుర్తు చేశారు. సరిగ్గా అదే విధంగా డిగ్రీ లెక్చరర్ల భర్తీ విషయంలోనూ ప్రయత్నం చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే జీవో నంబర్ 4 తో పాటు పీహెచ్డీ చేసిన వారికి 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూ కి పది మార్కులంటూ నిబంధనలు తమ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. అసలు పీహెచ్డీ అడ్మిషన్లే లేకుండా 25 మార్కుల వెయిటేజీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ మూడేళ్లుగా నిర్వహించకపోవటంతో ఎంతో మందికి అన్యాయం జరుగుతుందన్నారు. వెంటనే జీవో నంబర్ 4 ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అడ్డంకిగా ఉన్న జీవో లను రద్దు చేయాలి.

డీఎస్సీ కి జీవో నంబర్ 104, గ్రూప్స్ కు జీవో నంబర్ 29, పోలీసు ఉద్యోగాలకు జీవో నంబర్ 46, గురుకులాలకు జీవో నంబర్ 81, ఆడబిడ్డలకు రిజర్వేషన్లు రాకుండా జీవో నంబర్ 4 ను తెచ్చారని కవిత చెప్పారు. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ ఈ జీవోలను కనీసం సమీక్షించలేదని విమర్శించారు. దాదాపు 40 లక్షల కుటుంబాల్లో విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే…ప్రభుత్వం మాత్రం వారికి న్యాయం చేసే విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంత మంది కన్నీటి గాథలు ఇలా ఉంటే…సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆటలు ఆడుతుండటం సిగ్గుచేటన్నారు. మూసీ కి 7 వేల కోట్లు కేటాయిస్తూ రివ్యూ చేసే సమయం ఉన్న ప్రభుత్వానికి నిరుద్యోగులకు శాపంగా మారిన జీవో లపై సమీక్ష చేసే సమయం లేదా అని కవిత ప్రశ్నించారు. తెలంగాణ యువతను కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం వాడుకుందన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు చెబితే నమ్మరని రాహుల్ గాంధీతోనే నిరుద్యోగులకు హామీ ఇప్పించారని గుర్తుచేశారు. జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, అంగన్ వాడీ జీతాలు, గర్భీణులకు ఇచ్చే డబ్బులు, కిట్ లు కూడా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నిరుద్యోగుల సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల వద్దకు వెళ్లి…ప్రభుత్వంపై పోరాటానికి వారిని సన్నద్ధం చేస్తామని హెచ్చరించారు.

రేషన్ కార్డులు ఏరివేసే పైశాచికం మానేయాలి

రేషన్ కార్డుల విషయంలో పేదలకు అన్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమం పెట్టుకుందన్నారు. 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం ఏరివేత కార్యక్రమం ద్వారా 15 లక్షల రేషన్ కార్డులు తీసేయాలని చూస్తోందన్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో రేషన్ కార్డులు ఏరివేసే కుట్ర చేస్తున్నారని చెప్పారు. పేద ప్రజలకు మేలు చేసే రేషన్ కార్డుల విషయంలో పైశాచిక పనులను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కొండగట్టు పనుల్లో ఇంత నిర్లక్ష్యమా!

కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలి 15 మంది గాయపడిన ఘటనపై కవిత విచారం వ్యక్తం చేశారు. హనుమాన్ చిన జయంతి వేడుకల కోసం నాసిరకంగా పందిళ్లు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కొండగట్టు అంజన్న ఆలయంలో ఉత్సవాల సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించటంతో పాటు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.