epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అల‌ర్ట్!

అల‌ర్ట్!

రాబోయే 3 రోజులు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లొద్దు

ఆరోగ్య శాఖ హెచ్చరికలు

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు

వచ్చే మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు

అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న ఐఎండీ

ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్​ జిల్లాలోని తానూరులో 43.5 డిగ్రీలు, నిజామాబాద్​ జిల్లా భీం​గల్​లో 43.2 డిగ్రీలు నమోదయ్యియి. కామారెడ్డి జిల్లాలోని మద్నూల్​, కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా సిర్పూర్​, మంచిర్యాల జిల్లాలోని భీమారం, నల్గొండ జిల్లాలోని అడవి దేవులపల్లిలో 43.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 43 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు ఉన్నాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశముందని హైదరాబాద్​ ఐఎండీ కేంద్రం వెల్లడించింది. బుధవారం 33 కేంద్రాల్లో 41 నుంచి 43.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ‘ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సగటున 43.3 డిగ్రీలు నమోదయ్యింది. గురువారం ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముంది. శుక్ర, శనివారాల్లో సైతం పై జిల్లాలతో పాటు నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలో వడగాలులు వీస్తాయ’ని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం పేర్కొంది.

అప్రమత్తమైన ఆరోగ్య శాఖ

తెలంగాణలో రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వడదెబ్బ బాధితులకు సత్వరమే చికిత్స అందించే విధంగా ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని సూచించారు. దీంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రులకు, ప్రజలకు సూచిస్తూ వైద్యారోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఆరోగ్యశాఖ సూచించిన జాగ్రత్తలు ఇవే :

ప్రజలు మధ్నాహ్నం 12-3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదు
రోజూ తగినంత ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి
బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, టవల్​ లాంటివి ధరించాలి
ఆయిల్​, మసాలా ఫుడ్ తినడం తగ్గించాలి
వడదెబ్బ లక్షణాలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ఫ్లూయిడ్స్​, అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలి
గ్రామాల్లో ఏఎన్​ఎం, ఆశా సిబ్బంది ద్వారా ఓఆర్ఎస్​ పంపిణీ ముమ్మరం చేయాలి

లక్షణాలు :

శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగడం
తల తిప్పడం
వాంతులు
గుండె వేగంగా కొట్టుకోవడం
అపస్మారక స్థితికి చేరుకోవడం
పైన వివరించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ఆరోగ్య శాఖ సూచించింది.

సత్వర చికిత్స అందించేందుకు ఏర్పాట్లు

వడ దెబ్బ బాధితులకు వేగవంతమైన, మెరుగైన వైద్య చికిత్సను అందించేందుకు వీలుగా అన్ని హాస్పిటల్స్​లో ప్రత్యేకంగా డాక్టర్ల బృందాలు ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డా. గౌరవ్‌ ఉప్పల్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు అవగాహన కల్పించండి :

అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్​ పేషెంట్లు, ఔట్​ పేషెంట్ల వారి అటెండ్లెంట్లు, ఆస్పత్రి సిబ్బందికి తాగు నీరు అందుబాటులో ఉంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అవసరమైన చోట చలివేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉక్కపోత సమస్య ఎక్కువవుతున్నందున ఏసీలు, కూలర్లు, ఫ్యాన్​​లను అందుబాటులో ఉంచాలన్నారు. వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కార్మికులు వడ దెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారిని దృష్టిలో పెట్టుకుని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పేషెంట్‌ వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభించే విధంగా ప్రత్యేక బృందంలోని సిబ్బందికి అవసరమైన శిక్షణను ఇవ్వాలన్నారు. అన్ని ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.