రంగశాయిపేటలో మెగా మెడికల్ క్యాంప్
ఉచిత వైద్య పరీక్షలు, కార్డియాలజీ కన్సల్టేషన్
గుండె నిపుణుల సేవలతో ప్రజలకు ఉపశమనం
వాగ్బట యోగా సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
కాకతీయ, ఖిలావరంగల్ : మెగా మెడికల్ క్యాంప్ ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ముఖ్య లక్ష్యమని కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ అత్తే భగీరధ్ తెలిపారు. ఆదివారం రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వాగ్బట యోగ అండ్ వాకర్స్ అసోసియేషన్ మరియు మన ముచ్చట్లు వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఫాదర్ కొలంబో వైద్య కళాశాల మెడికేర్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ అత్తే భగీరధ్, ఇంచార్జ్ డాక్టర్ చందనతో పాటు వైద్య బృందం శిబిరంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఉచితంగా బీపీ, ఈసీజీ పరీక్షలు నిర్వహించడంతో పాటు కార్డియాలజీ కన్సల్టేషన్ అందించారు. ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ అవసరమైన జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమానికి వాగ్బట యోగా సంఘం మరియు మన ముచ్చట్లు గ్రూప్ వ్యవస్థాపకులు పెరుమాండ్ల మధుసూదన్, పెసర నిరంజన్ రెడ్డి నేతృత్వం వహించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సంఘం అధ్యక్షుడు గుర్రపు రామ్ చందర్, ప్రధాన కార్యదర్శి పోశాల కన్నయ్య, కోశాధికారి వడ్డీ ప్రతాపరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తాళ్లపల్లి రవీందర్ గౌడ్, సుభాష్ గౌడ్, నవీన్ రెడ్డి, రాంబాబు, ఖాన్ సాబ్, ప్రవీణ్, చిన్న, సాంబయ్య, గోపాల్, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

