epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దుమ్ములేపిన డీపీఎస్​.. పల్లవి ప్రభంజనం

దుమ్ములేపిన డీపీఎస్​.. పల్లవి ప్రభంజనం
సీబీఎస్​ఈ టెన్త్​ ఫలితాల్లో సత్తా చాటిన స్టూడెంట్స్​
అన్ని స్కూళ్లలో100 శాతం ఉత్తీర్ణత నమోదు
95 శాతానికి పైగా స్కోర్​ చేసిన 237 మంది విద్యార్థులు
716 మంది స్టూడెంట్స్​ 90 శాతానికి పైగా స్కోర్
విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
ప్రతిభా పురస్కారాలు అందజేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ
డీపీఎస్​, పల్లవి విద్యాసంస్థల సీఈవో మల్క యశస్వి అభినందనలు

కాక‌తీయ‌, హైదరాబాద్ ​: విద్యా ప్రమాణాల్లో మేటిగా నిలుస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్​ స్కూల్స్​ మరో అద్భుత మైలురాయిని దాటాయి. తాజాగా వెలువడిన సీబీఎస్​ఈ పదో తరగతి ఫలితాల్లో పల్లవి, డీపీఎస్​ విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించి విజయ పరంపరను కొనసాగించారు. 237 మంది విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్​ చేశారు. 716 మంది స్టూడెంట్స్​ 90 శాతానికి పైగా స్కోర్​ చేశారు. 1582 మంది విద్యార్థులు 80 శాతం స్కోర్​ సాధించారు. 98 శాతం విద్యార్థులు 60 శాతానికి పైగా స్కోర్​ చేయడం విశేషం. కాగా ప్రతిభ చాటిన విద్యార్థులకు సోమవారం బాగ్ లింగంపల్లిలోని టీజీఎస్ ​ఆర్టీసీ కళ్యాణ మండపం ఆడిటోరియంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, డీపీఎస్ మ‌రియు పల్లవి గ్రూప్ విద్యాసంస్థల ఛైర్మన్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, సీబీఐ మాజీ జాయింట్​ డైరెక్టర్​ లక్ష్మీనారాయణ, డీపీఎస్​, పల్లవి విద్యాసంస్థల సీఈవో మల్క యశస్వి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

1. నాచారం డీపీఎస్​ 100 శాతం
ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​ నాచారం క్యాంపస్​ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సీబీఎస్​ఈ ఫలితాల్లో దుమ్మురేపింది. ఈ క్యాంపస్​ లో మొత్తం 1214 మంది స్టూడెంట్స్​ సీబీఎస్​ఈ పదో తరగతి పరీక్ష రాయగా.. 740 మంది స్టూడెంట్స్​ 60 శాతానికిపైగా స్కోర్​ చేశారు. 253 మంది 90 శాతానికి పైగా స్కోర్​ చేయగా.. 93 మంది స్టూడెంట్స్​ 99 శాతం మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపల్​ తురగ పద్మ జ్యోతి అభినందించారు.

2. నాదర్​ గుల్​ డీపీఎస్​ టాప్​
ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​ నాదర్​ గుల్​ క్యాంపస్​ విద్యార్థులు సత్తా చాటారు. ఇక్కడ మొత్తం 740 మంది స్టూడెంట్స్​ టెన్త్​ పరీక్ష రాస్తే.. ఇందులో 735 మంది 60 శాతానికి పైగా స్కోర్​ చేయడం విశేషం. 120 మంది స్టూడెంట్స్​ 90 శాతానికి పైగా స్కోర్​ సాధిస్తే.. 41 మంది విద్యార్థులు 99 శాతం స్కోర్​ చేసి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ప్రతిభచాటిన విద్యార్థులను ప్రిన్సిపల్​ డా. అనుపమ సక్సేనా ప్రత్యేకంగా అభినందించారు.

3. మహేంద్రహిల్స్​ డీపీఎస్​
ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​ మహేంద్రహిల్స్​ క్యాంపస్​ స్టూడెంట్స్​ పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 134 మంది స్టూడెంట్స్​ పరీక్ష రాస్తే అందరూ 60 శాతానికి పైగా స్కోర్​ చేశారు. 54 మంది 90 శాతానికి పైగా, 16 మంది 98 శాతం ఫలితాలు సాధించి ఔరా అనిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్​ నందిత సుంకర ప్రత్యేకంగా అభినందించారు.

4. పల్లవి బోడుప్పల్​
పల్లవి బోడుప్పల్​ స్టూడెంట్స్​ సీబీఎస్​ఈ టెన్త్​ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 258 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. 249 మంది స్టూడెంట్స్​ 60 శాతానికి పైగా స్కోర్​ చేశారు. 57 మంది 90 శాతానికిపైగా, 20 మంది 99 శాతం స్కోర్​ చేసి సత్తా చాటారు. విద్యార్థులను తనూజ అభినందించారు.

5. పల్లవి అల్వాల్ క్యాంపస్​
పల్లవి స్కూల్​ అల్వాల్​ క్యాంపస్​ స్టూడెంట్స్​ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 301 మంది స్టూడెంట్స్​ పరీక్ష రాయగా.. అందులో 294 మంది 60 శాతానికి పైగా స్కోర్​ చేశారు. 57 మంది 90 శాతానికి పైగా, 27 మంది 99 శాతం మార్కులు స్కోర్​ చేశారు. ఈ సందర్భంగా సత్తా చాటిన విద్యార్థులను ప్రిన్సిపల్​ ఏఎస్​ విద్యాధరి అభినందించారు.

6. పల్లవి బోయిన్​ పల్లి క్యాంపస్​
​ పల్లవి బోయిన్​ పల్లి క్యాంపస్​ స్టూడెంట్స్​ సీబీఎస్​ఈ టెన్త్​ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 259 మంది పరీక్షకు హాజరవగా 253(97%) మంది 60 శాతానికిపైగా స్కోర్​ చేశారు. 69 మంది స్టూడెంట్స్​ 90 శాతానికిపైగా, 21 మంది స్టూడెంట్స్​ 98 శాతం స్కోర్​ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్​ డా. రాజేశ్​ అభినందించారు.

7. పల్లవి గండిపేట్​ క్యాంపస్​
పల్లవి గండిపేట్​ స్కూల్​ క్యాంపస్​ స్టూడెంట్స్​ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇక్కడ 135 మంది పరీక్ష రాయగా.. 134 మంది అంటే 99 శాతం స్టూడెంట్స్​ 60 శాతానికిపైగా స్కోర్​ చేశారు. 36 మంది 90 శాతానికి పైగా, 8 మంది స్టూడెంట్స్​ 98 శాతం స్కోర్​ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్​ హేమ ప్రత్యేకంగా అభినందించారు.

8. పల్లవి కీసర క్యాంపస్​
పల్లవి కీసర స్కూల్​ క్యాంపస్​ స్టూడెంట్స్​ సత్తా చాటారు. ఇక్కడ మొత్తం 83 మంది పరీక్ష రాయగా.. 78 మంది 60 శాతానికిపైగా స్కోర్​ చేశారు. 12 మంది 90 శాతానికి పైగా, ఆరుగురు స్టూడెంట్స్​ 98 శాతం స్కోర్​ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్​ శ్రీలత ప్రత్యేకంగా అభినందించారు.

9. పల్లవి సరూర్​ నగర్​ క్యాంపస్​
పల్లవి సరూర్​ నగర్​ స్కూల్​ క్యాంపస్​ స్టూడెంట్స్​ సత్తా చాటారు. ఇక్కడ మొత్తం 64 మంది పరీక్ష రాయగా.. ఇందులో 63 మంది అంటే 99 శాతం స్టూడెంట్స్​ 60 శాతానికిపైగా స్కోర్​ చేశారు. 12 మంది 90 శాతానికిపైగా, నలుగురు స్టూడెంట్స్​ 97 శాతం స్కోర్​ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్​ డి.కిరణ్మయి ప్రత్యేకంగా అభినందించారు.

10. అక్షర వాగ్దేవి క్యాంపస్​
అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్​ స్కూల్​ స్టూడెంట్స్​ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఇక్కడ మొత్తం 77 మంది పరీక్ష రాయగా.. 74 మంది 60 శాతానికిపైగా స్కోర్​ చేశారు. 14 మంది 90 శాతానికిపైగా, ఒకరు 97 శాతం స్కోర్​ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపల్​ అభినందించారు.

మంచి పౌరులుగా ఎదగాలి : – వి.వి. లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ జేడీ
విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులుగా ఎదగాలి. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి. డీపీఎస్​, పల్లవి విద్యాసంస్థలను నేను చాలా సంవత్సరాల నుంచి దగ్గరగా గమనిస్తున్నాను. విద్యా ప్రమాణాల్లో మేటిగా నిలుస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. మార్కులతోపాటు జ్ఞానం, శీలం ముఖ్యమైనవని, విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని.. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.

సర్వతోముఖాభివృద్ధికి కృషి : మల్క కొమరయ్య, ​, ఎమ్మెల్సీ, డీపీఎస్​, పల్లవి విద్యాసంస్థల చైర్మన్
ఇటీవల వెలువడిన సీబీఎస్​ఈ పదో తరగతి ఫలితాల్లో డీపీఎస్​, పల్లవి విద్యాసంస్థల విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం గొప్ప విషయం. సుమారు 300 మందికి పైగా విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులై సరికొత్త రికార్డు సృష్టించడం వెనుక విద్యార్థుల నిరంతర శ్రమ, టీచర్ల సమర్థవంతమైన బోధన, తల్లిదండ్రుల కృషి ఉంది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా డీపీఎస్​, పల్లవి విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి.

విద్యార్థులకు అభినందనలు : మల్క యశస్వి, సీఈవో, డీపీఎస్​, పల్లవి గ్రూప్ విద్యాసంస్థలు

సీబీఎస్​ఈ ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు. విద్యార్థులు సాధించిన ఈ విజయం అందరికీ గర్వకారణం.100 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, ఇంత పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్​ టాపర్లు రావడం మా విద్యాసంస్థల క్వాలిటీ ఎడ్యుకేషన్​ కు నిదర్శనం. మా విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తారన్న విశ్వాసం మాకుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, సీనియర్‌ అసిస్టెంట్‌ పట్టివేత సీఎంఆర్‌ఎఫ్‌ బిల్లు మంజూరుకు...

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం

ఉప్పల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లంచాల ప‌ర్వం డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అదనపు...

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు

దక్షిణ కొరియా వర్సిటీలో నిషితకు సీటు ప్రతిష్ఠాత్మక ‘కొయికా’ ఫుల్‌ స్కాలర్‌షిప్‌తో ఎంఎస్సీ...

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌!

హైదరాబాద్‌లో లండన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌! క్యాంపస్‌ ఏర్పాటుకు లండన్‌ యూనివర్సిటీ ప్రతినిధుల కసరత్తు విస్తృత...

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌

‘ఖేలో ఇండియా’ గేమ్‌చేంజర్‌ గ్రాస్‌రూట్‌ స్థాయి నుంచే క్రీడాకారుల తీర్చిదిద్దడం 2026–31 కాలానికి రూ.29,054...

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు

మాజీ తహసీల్దార్‌ ఇంటిపై ఏసీబీ దాడులు ఒకేసారి 15 చోట్ల సోదాలు ఆదాయానికి మించిన...

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌

కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కూనూరు నిరంజన్‌ గౌడ్‌ కాకతీయ,...

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.