epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజల మధ్యే ఉంటూ.. అదే ఆశయంతో పనిచేస్తా

ప్రజల మధ్యే ఉంటూ.. అదే ఆశయంతో పనిచేస్తా
మాజీ మావోయిస్ట్ నేత దామోదర్
లొంగుబాటు తర్వాత తొలిసారి స్వగ్రామానికి బడే చొక్కారావు
28 ఏళ్ల తర్వాత తల్లి వ‌ద్ద‌కు.. 30 ఏళ్ల తర్వాత కాల్వపల్లిలో పర్యటన..
గ్రామస్తుల ఆత్మీయ స్వాగతం
జనజీవన స్రవంతిలోకి రావాలని అడవుల్లో ఉన్నవారికి పిలుపు

కాకతీయ, ఏటూరునాగారం: మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, దాదాపు మూడు దశాబ్దాల సాయుధ ప్రస్థానం అనంతరం జనజీవన స్రవంతిలోకి చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లోంగిపోయిన ఆయన మంగళవారం తొలిసారి తన స్వగ్రామమైన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చేరుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత గ్రామంలో అడుగుపెట్టిన దామోదర్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు, పాత మిత్రులు మరియు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు.

అమ్మతో ఆత్మీయ ఆలింగనం..

గ్రామానికి చేరుకున్న దామోదర్, దాదాపు 28 సంవత్సరాల తర్వాత తన తల్లిని కలుసుకోవడం అత్యంత భావోద్వేగాన్ని నింపింది. ముసలి తల్లిని చూసి ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. తల్లి కొడుకులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న దృశ్యం అక్కడి వారిని కలచివేసింది. అనంతరం బంధువులు, స్నేహితులతో కాసేపు ముచ్చటించి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా స్వగ్రామంలో మీడియాతో మాట్లాడిన దామోదర్, మావోయిస్ట్ పార్టీలో 30 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత సొంత ఊరికి రావడం సంతృప్తినిచ్చిందని, తల్లిని కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. అడవిలో గడిపిన కాలంలో వచ్చిన అనుభవం, సహనం తనకు మనోబలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. తన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని చెప్పినా, జీవితాంతం ప్రజల మధ్యే ఉండి వారి కోసం పనిచేస్తానని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

అడవి బాట వీడి రండి..

అడవుల్లో ఉన్న మావోయిస్ట్ కార్యకర్తలు బయటకు వచ్చి సమాజంలో భాగస్వామ్యం కావాలని దామోదర్ పిలుపునిచ్చారు. అలాగే, ప్రభుత్వం కూడా మాజీలపైన విధిస్తున్న ఆంక్షలను తగ్గించాలని అభిప్రాయపడ్డారు. జైళ్లలో ఉన్న వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించి విడుదల చేయాలని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను కోరినట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్లలో మరణించిన వారి కుటుంబాలను కలుసుకుని వారికి మనోధైర్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

దళ సభ్యుడి నుంచి రాష్ట్ర కార్యదర్శి వరకు..

కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు చిన్న వయసులోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. 1993లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరి దళ సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎల్డీఎస్ కమాండర్, డిప్యూటీ కమాండర్, ఏటూరునాగారం ఏరియా కమిటీ కార్యదర్శి, జిల్లా కమిటీ సభ్యుడు, ఖమ్మం–కరీంనగర్–వరంగల్ ప్రాంత కార్యదర్శి మరియు ఉత్తర తెలంగాణ డివిజన్ కమిటీ కార్యదర్శి వంటి పలు కీలక హోదాల్లో పనిచేశారు. చివరకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగారు. ములుగు, భూపాలపల్లి అటవీ ప్రాంతాలపై పట్టు కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయనపై ఛత్తీస్‌గఢ్‌లో రూ.50 లక్షలు, తెలంగాణలో రూ.25 లక్షల రివార్డులు ప్రకటించబడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీతో పాటు మరికొంత మంది నేతలతో కలిసి లొంగిపోవ‌డంతో ఆయన సాయుధ పోరాటానికి స్వస్తి పలికినట్లయింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.