epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మహిళా రిజర్వేషన్ అమ‌లు చేయాలి

మహిళా రిజర్వేషన్ అమ‌లు చేయాలి

డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేయొద్దు

చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ

పోస్ట్ కార్డుపై సంతకాల సేకరణ ..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: 2023 చట్టం ప్రకారం ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాల‌ని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలంటూ గాంధీభవన్‌లో మహిళా ఆరక్షన్ బిల్ ఆజ్ కరో అభి కరో అనే నినాదంతో పోస్ట్ కార్డుపై సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి పీఎంవో ఆఫీస్ కి పంపారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. పార్లమెంట్ 2023 సెప్టెంబర్‌లో ఏకగ్రీవంగా ఆమోదించిన “నారీ శక్తి వందన్ అధినియమ్ 2023″ను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ కోసం కొత్త జనగణన, డీలిమిటేషన్ పేరుతో కాలయాపన చేయకుండా 2023 చట్టాన్ని ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లకు వర్తింపజేసి, 2029 సార్వత్రిక ఎన్నికల నుండే 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల‌ని కోరారు. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం దక్షిణాది, ఈశాన్య, చిన్న రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్ర అన్నారు.

సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకం

కుల గణన లేకుండా ఎన్నికల మ్యాప్‌ను మార్చే ప్రయత్నాన్ని మేం అంగీకరించం. ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకం. 2023 మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ప్రస్తుత సీట్ల ప్రకారం అమలు చేసేందుకు కేంద్రం ఏ సవరణలు తీసుకొచ్చినా ఇండియా కూటమి పూర్తి మద్దతు ఇస్తుంది. 33శాతం రిజర్వేషన్‌లో ఎస్‌సీ, ఎస్‌టీ మహిళలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా సబ్-కోటా కల్పించాలి. సామాజిక న్యాయం లేని రిజర్వేషన్ అసంపూర్ణం. మహిళా సాధికారత విషయంలో మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మాటలు చెప్పి మోసం చేయడం, “తమాషా” చేయడం మానేసి, ఆమోదం పొందిన చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. 2023 చట్టం కోసం మరో 5-10 ఏళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. దేశ మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రస్తుత 543 సీట్లలో 181 సీట్లను మహిళలకు కేటాయించి 2029 ఎన్నికలను నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం… అని స్వ‌ర్ణ అన్నారు.

బీజేపీ స్వార్థం కోసమే

బీజేపీ స్వార్థం కోసమే మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టింది. 2023 సెప్టెంబర్‌లోనే నారీ శక్తి వందన్ అధినియమ్ ఆమోదం పొందినా, దాన్ని వెంటనే అమలు చేయకుండా జనగణన, డీలిమిటేషన్ పేరుతో 10 ఏళ్లు వాయిదా వేయడం బీజేపీ దురుద్దేశాన్ని బయటపెడుతోంది. కుల గణన జరిగితే ఓబీసీల వాస్తవ సంఖ్య బయటపడుతుందని, సామాజిక న్యాయం కోసం డిమాండ్ పెరుగుతుందని బీజేపీ భయపడుతోంది. అందుకే కుల గణన లేకుండా డీలిమిటేషన్ చేసి, ఎన్నికల మ్యాప్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. మోదీ గ్యారంటీ అని చెప్పి మహిళలను మోసం చేసింది బీజేపీనే. బిల్లు పాస్ చేశామని చెప్పుకుంటూ, అమలు మాత్రం చేయకుండా మహిళల ఆకాంక్షలతో ఆటలాడుకుంటోంది. బీజేపీ స్వార్థ రాజకీయాల కోసం మహిళా సాధికారతను తాకట్టు పెట్టడాన్ని దేశం గమనిస్తోంది. మహిళలకు న్యాయం జరగాలంటే బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి. కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షాన నిలబడుతుందని అని స్వ‌ర్ణ అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.