epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మక్క రైతులకు మార్కెట్లో ‘చుక్కలు’

మక్క రైతులకు మార్కెట్లో ‘చుక్కలు’
ఏనుమాములలో ఆగని అవస్థలు!
బార్దాన్లు లేక రెండు రోజులుగా నిలిచిన కాంటాలు
ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌లో ‘కర్షక’ రోదన
గోదాముల్లో దిగుమతి జాప్యం.. యార్డుల్లోనే రైతుల జాగారం
వర్షం వస్తే గతేంటని రైతుల ఆందోళన
టార్పాలిన్లు ఉన్నాయంటూ సరిపెడుతున్న అధికారులు
ప్రభుత్వ ప్రకటనలు కోటలు దాటుతున్నా.. క్షేత్రస్థాయిలో కష్టాలు తీరని వైనం

కాకతీయ, వరంగల్: రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఊదరగొడుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మారుతున్నాయి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఏనుమాములలో మక్క రైతుల పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. అధికారులు, పాలకుల సమన్వయ లోపంతో రైతులు కంటిమీద కునుకు లేకుండా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఏనుమాముల మార్కెట్‌లో గత రెండు రోజులుగా బార్దాన్ల (గోనె సంచులు) కొరత తీవ్రంగా వేధిస్తోంది. మార్క్ ఫెడ్ అధికారులు సకాలంలో బార్దాన్లు సరఫరా చేయకపోవడంతో కాంటాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆరబోసిన మక్కలు యార్డుల్లోనే పేరుకుపోవడంతో, అకాల వర్షం ఎప్పుడు ముంచుకొస్తుందోనని రైతులు ప్రాణసంకటంలో ఉన్నారు. రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం నిద్రపోయేందుకు కూడా వీలులేకుండా మక్కలను కాపాడుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోదాముల్లో దిగుమతి జాప్యం..
మరోవైపు, కాంటాలు పూర్తయిన మక్కలను గోదాములకు తరలించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. గోదాముల్లో దిగుమతి ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో అటు కొనుగోళ్లపై కూడా ఆ ప్రభావం పడుతోంది. అస్తవ్యస్తంగా మారిన ఈ వ్యవస్థతో రైతులు అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. మార్కెట్ అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ దుస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అంగీకరించిన మార్కెట్ కార్యదర్శి..
బార్దాన్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం వెల్లడించారు. గోదాముల్లో దిగుమతి కూడా ఆలస్యంగానే జరుగుతోందని ఆయన అంగీకరించారు. అయితే, వర్షం వస్తే మక్కలు తడవకుండా ఉండేందుకు సుమారు 800 టార్పాలిన్లను అందుబాటులో ఉంచామని, రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అధికారులు కేవలం టార్పాలిన్లతో సరిపెట్టకుండా, తక్షణమే బార్దాన్లు తెప్పించి కాంటాలు ప్రారంభించాలని మక్క రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.