epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన

రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన
రైతు మేళాలు కాదు.. రైతు బాధలు చూడండి
సమస్యలపై ప్రశ్నిస్తే ప్ర‌భుత్వం ఉలిక్కి పడుతోంది
ధాన్యం కొనుగోళ్లు లేక ఇబ్బందుల్లో రైతులు
కేసులు, జైళ్లు మాకు కొత్త కాదు.. మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌లేరు
విమ‌ర్శ‌లు కాదు.. పాల‌న‌పై దృష్టి పెట్టండి
తెలంగాణ భ‌వ‌న్ ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కాకతీయ, వరంగల్ బ్యూరో : హైద‌రాబాద్ తెలంగాణ భవన్‌ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు మేళా పేరుతో కేవలం రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రైతు మేళాల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలను బస్సుల్లో తీసుకొచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇప్పటివరకు 50 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని, రైతులకు బోనస్ ఇవ్వలేదని ఆరోపించారు. మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో తీవ్ర పంటనష్టం జరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా అధికారులు కనీసం పరిశీలన చేయలేదన్నారు. రైతుల తరఫున కేటీఆర్ మాట్లాడితే కేసులు పెడుతున్నారని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రైతుల కోసం మా పోరాటం ఆగదు, దమ్ముంటే కేసులు పెట్టండి, జైలుకెళ్లేందుకైనా సిద్ధమే అని హెచ్చరించారు.

రైతు డిక్లరేషన్ అమలు చేయాలి

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బంగారు కాలం వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు మంత్రులు కల్లాల్లో తిరిగేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతులు ధాన్యం కుప్పల వద్దే పడుకునే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ గుండాలు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, బండి సంజయ్ వాడిన భాష అసహ్యకరమని నేతలు విమర్శించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రైతు సంగ్రామ సభకు భారీగా రైతులు హాజరయ్యారని తెలిపారు. రైతుల బాధలపై ప్రశ్నలు అడిగితే కాంగ్రెస్ నేతలు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల సమస్యలు తెలియని వారు మాట్లాడుతున్నారు. గింజ ధాన్యం కూడా కొనలేక పోయిన ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు.

కాంగ్రెస్ రైతులను మోసం చేసింది..

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సభకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు చేసిందన్నారు. కాంగ్రెస్ రైతు మేళా పూర్తిగా విఫలమైందని, కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. రైతు బంధు కోసం రైతులు ధర్నాలు చేయకుండానే కేసీఆర్ ఆ పథకం అమలు చేశారని గుర్తుచేస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమని విమర్శించారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. రైతుల తరఫున కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ మీ కేసులకు భయపడే నాయకుడు కాదు అని స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.