రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కాకతీయ, ఏటూరునాగారం: చేపలు విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట జాతీయ రహదారి-163పై చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన నర్సయ్య, రాంప్రసాద్ ఇద్దరూ చేపలు విక్రయించేందుకు ఏటూరునాగారం నుంచి ముళ్లకట్ట వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాగా తీవ్ర గాయాలపాలైన రాంప్రసాద్‌ను చికిత్స నిమిత్తం ఏటూరునాగారం ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

