epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మునిసిప‌ల్‌లో ప‌వ‌ర్ బ్రోక‌ర్‌

మునిసిప‌ల్‌లో ప‌వ‌ర్ బ్రోక‌ర్‌
జమ్మికుంట మునిసిపాలిటీలో ‘వేతన’ దందా.. 
జీతాల పెంచుతామంటూ కార్మికుల నుంచి వ‌సూళ్లు
ఒక్కోరి నుంచి రూ.70 నుంచి రూ.80వేల వ‌రకు సేక‌ర‌ణ‌
ఔట్‌సోర్సింగ్ అధికారి ‘సదానందం’ పై వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌లు
‘డబ్బు’ ఇచ్చిన వారికే వేతనాల పెంపు? అంటూ ప్ర‌చారం
బాగోతం బయటపెట్టిన వార్డు కౌన్సిలర్.. అయినా మౌనంగానే అధికారులు
‘ఎవరికైనా చెప్పుకో.. నాకేం కాదు’ అంటూ నిందితుడి బరితెగింపు
కాకతీయ, క‌రీంన‌గ‌ర్ : జమ్మికుంట మున్సిపాలిటీలో పాలన పట్టాలు తప్పడమే కాదు.. అవినీతికి అడ్డాగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం ప్రజలకు సేవ చేయాల్సిన మున్సిపల్ కార్యాలయం, ఇప్పుడు ఉద్యోగుల రక్తాన్ని పిండే ‘వసూళ్ల కేంద్రం’గా మారిందని బాధితులు గొల్లుమంటున్నారు. వేతనాల పెంపు పేరిట సాగుతున్న ఈ చీకటి దందా ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం రేపుతోంది. మున్సిపాలిటీలో సానిటరీ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సదానందం ఇప్పుడు జమ్మికుంట మున్సిపాలిటీకి ‘అనధికార బాస్’గా చెలామణి అవుతున్నారనే చర్చ నడుస్తోంది. అధికారులతో తనకున్న సన్నిహిత సంబంధాలను సాకుగా చూపి, తోటి ఉద్యోగుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. “డబ్బులిస్తేనే జీతాలు పెరుగుతాయి.. లేదంటే మీ ఫైలు కదలదు” అంటూ బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
      వివ‌రాలు వెల్ల‌డిస్తున్న మునిసిప‌ల్ కార్మికులు
డ్రైవర్ల నుంచి రూ. 80వేల చొప్పున వ‌సూళ్లు
మున్సిపాలిటీలో పనిచేస్తున్న వాహన చోదకులే (డ్రైవర్లు) ఈ దందాకు ప్రధాన బాధితులుగా మారారు. ఎనిమిది మంది డ్రైవర్ల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 80 వేల చొప్పున, మరో ఇద్దరి నుంచి రూ. 50 వేల చొప్పున.. ఇలా సుమారు రూ. 7.40 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అన్నింటికంటే దారుణమైన విషయం ఏమిటంటే.. సీనియార్టీ ప్రకారం ముందుగా అర్హత ఉన్న వారిని పక్కనపెట్టి, ఎవరైతే భారీగా ముడుపులు చెల్లించారో వారికే వేతనాల పెంపు వర్తింపజేసినట్లు తెలుస్తోంది.
ఈ అక్రమ వసూళ్ల వ్యవహారంపై 7వ వార్డు కౌన్సిలర్ ఆరా తీయడంతో అసలు గుట్టు రట్టయింది. బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కడంతో ఈ దందా తీరు వెలుగులోకి వచ్చింది. “డబ్బులు ఇవ్వకపోతే జీతాల పెంపు ఉండదని మాపై ఒత్తిడి తెచ్చారు” అని ఉద్యోగులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, పాలకవర్గం మాత్రం మౌన ప్రేక్షకుల్లా మిగిలిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడి వెనుక ఏ ‘రాజకీయ’ శక్తి ఉందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.
విచారణ ఎప్పుడు?
“ఎవరికైనా చెప్పుకోండి.. నాకేమీ కాదు” అన్నట్లుగా సదానందం వ్యవహరిస్తున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వేతనాల పెంపులో జరిగిన ఈ అవకతవకలపై, లక్షల రూపాయల లావాదేవీలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని బాధితులు కోరుతున్నారు. సమగ్ర విచారణ జరిపి, ఈ ‘పవర్ బ్రోకర్’ ఆగడాలకు చరమగీతం పాడాలని జమ్మికుంట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.