epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నత్త నడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం!

నత్త నడకన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం!
సగానికి పైగా స్లాబ్ దశలోనే నిలిచిన వైనం
అమాంతం పెరిగిన నిర్మాణ ఖర్చుల భారం
మొదటి విడత లక్ష్యాలకు దూరంగా ములుగు జిల్లా
ఇటుక, కంకర రేట్లను భారీగా పెంచేసిన వ్యాపారులు
రెండో విడత ప్రారంభానికి ముందే లబ్ధిదారుల్లో ఆందోళన
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు ఆశించిన స్థాయిలో సాగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు కేటాయించిన ఇళ్లలో చాలా భాగం ఇంకా పూర్తి కాకపోవడం, నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కేటాయించిన ఇండ్లలో కేవలం 15 శాతం మాత్రమే పూర్తవటం, నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరగటం లబ్ధిదారులను కలవరపెడుతోంది. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిసి ఇటుక, కంకర రేట్లను యాజమానులు అకస్మాత్తుగా పెంచడం నిర్మాణ భారాన్ని పెంచుతుంటే, ఇండ్లకు సరిపోను నిర్మాణ కార్మికుల కొరత కొంత ఇండ్ల నిర్మాణాన్ని వెనుకబడేలా చేస్తుందని జిల్లా వాసులు భావిస్తున్నారు.
సగానికి పైగా స్లాబ్ దశ వద్దే..
జిల్లాకు మొత్తం 5000 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా, వాటిలో 4396 ఇళ్లు నిర్మాణ దశకు చేరుకున్నాయి. అయితే, నిర్మాణాల పురోగతిని పరిశీలిస్తే పరిస్థితి నిరాశాజనకంగా కనిపిస్తోంది. మొత్తం ఇళ్లలో సుమారు 50 శాతం అంటే 2448 ఇళ్లు స్లాబ్ దశ వద్దే నిలిచిపోయాయి. ఇక కేవలం 15 శాతం అంటే 686 ఇళ్లు మాత్రమే పూర్తవడం గమనార్హం. జిల్లాలో అత్యధికంగా ఇళ్లు కేటాయించిన మండలం గోవిందరావుపేట. ఇక్కడ 500 ఇళ్లకు గాను కేవలం 122 ఇళ్లు (24.4 శాతం) మాత్రమే పూర్తవడం, పథకం అమలులో ఉన్న లోపాలను బయటపెడుతోంది. ప్రభుత్వం ఆశించిన వేగం అందుకోలేకపోవడం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది.
లబ్ధిదారులపై మోయలేని భారం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మందగించడానికి ప్రధాన కారణంగా నిర్మాణ ఖర్చులు పెరగడం చెప్పబడుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయని తెలిసి ఇటుక ధరలను అమాంతం పెంచి అమ్ముతుండటం, కాంక్రీట్ కోసం ఉపయోగించే కంకర రేట్లను కూడా వ్యాపారులు భారీగా పెంచడంతో ఇంటి నిర్మాణం ఖర్చు పెరుగుతోంది. సిమెంట్, ఇనుము, కార్మిక వ్యయాలు పెరగడంతో లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ప్రస్తుత ధరలకు సరిపోకపోవడం వల్ల చాలా మంది మధ్యలోనే నిర్మాణాలను ఆపాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం, ప్రస్తుతం లబ్ధిదారులకే భారంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండో విడతపై సందేహాలు
ఇదిలా ఉండగా, జూన్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే మొదటి విడతలోనే పూర్తి స్థాయిలో ఇళ్లు పూర్తికాకపోవడం నేపథ్యంలో, రెండో విడత అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలంటే కేవలం ఇళ్ల కోసమే రేట్లు పెంచి అమ్ముతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకొని, కావలసిన నిర్మాణ సామాగ్రిని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు. మొదలు పెట్టిన ప్రతి ఇంటి నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందించే లక్ష్యంగా గృహ నిర్మాణం వేగం అందుకోకపోతే, పథకం అసలు ఉద్దేశం నెరవేరదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.