epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆనంద్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

ఆనంద్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏకకాలంలో తనిఖీలు
రెండు ఇళ్లు, ఆరు ఖాళీ స్థలాల పత్రాలు స్వాధీనం
రూ.24.50 లక్షల నగదు, బ్యాంకుల్లో రూ.7.05 లక్షల నిల్వలు గుర్తింపు
సుమారు 819 గ్రాముల బంగారం, 2.2 కిలోల వెండి వస్తువులు లభ్యం
పత్రాల విలువ రూ.1.94 కోట్లు.. మార్కెట్ విలువ ఎక్కువ‌గా ఉంటుంద‌నే అంచ‌నాలు
కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : వరంగల్ రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ 2 గా పనిచేస్తూ, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న అధికారి దావులూరి ఆనంద్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయన తన సర్వీసు కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు మే 20న హన్మకొండలోని ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మరికొన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
స్థిరాస్తుల పత్రాలు, వాహనాల గుర్తింపు
జరిపిన తనిఖీల్లో సదరు అధికారికి సంబంధించిన పలు స్థిరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.71,56,708 విలువైన రెండు నివాస గృహాలు, అలాగే రూ.28,37,000 విలువైన ఆరు ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు ఆయన ఇళ్లలో రూ.13,25,000 విలువైన ఒక నాలుగు చక్రాల వాహనం (కారు), రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు సోదాల్లో తేలింది. అలాగే రూ.6,07,700 విలువ చేసే గృహోపకరణ వస్తువులను అధికారులు కనుగొన్నారు. సోదాల సమయంలో ఆయన ఇళ్లలో రూ.24,50,450 అగడ్తా నగదు లభ్యమైంది. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.7,05,367 నగదు నిల్వలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు రూ.43,16,930 విలువైన సుమారు 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2264.500 గ్రాముల (సుమారు 2.2 కిలోల) వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన పత్రాల ప్రకారం ఈ ఆస్తుల మొత్తం అధికారిక విలువ రూ.1,94,01,765 గా తేలింది. అయితే బహిరంగ మార్కెట్ లో వీటి విలువ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆస్తులకు సంబంధించి అదనపు ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, కేసు దర్యాప్తు దశలో ఉందని అవినీతి నిరోధక శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.