మృతుడి కుటుంబానికి సర్పంచ్ సాయం
కాకతీయ, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన లింగంపెల్లి బాలయ్య ఇటీవల మరణించగా, గురువారం సర్పంచ్ ఎం. రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్నికల హామీ మేరకు బాధిత కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని సర్పంచ్ అందజేసి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చేరాల వంశీకృష్ణ, అంతటి శ్రీకాంత్ గౌడ్, రజక సంఘం అధ్యక్షుడు లింగంపల్లి రవీందర్, సిరికొండ రాజు, దయ్యల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

