epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కార్మికుల వేతనాల పెంపులో చిత్తశుద్ధి లేదు

కార్మికుల వేతనాల పెంపులో చిత్తశుద్ధి లేదు
పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు లేవు
కేటగిరీల విభజనలో ఎలాంటి స్పష్టత లేదు
గత ప్రభుత్వ హయాం కంటే తక్కువగా వేతనాలు
మేనిఫెస్టోలోని కనీస వేతనాల హామీలను గాలికి వదిలేశారు
మూడు లక్షల మంది స్కీమ్ వర్కర్ల పరిస్థితి ఏంటి
ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి
బీఆర్ఎస్ నేత, మాజీ ప్ర‌భుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కనీస వేతనాల పెంపులో ఎలాంటి శాస్త్రీయత లేదని, ఇది కార్మికుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ ప్ర‌భుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, ఇప్పుడు చేస్తున్న ఆచరణకు అస్సలు పొంతన లేదని ఆయన మండిపడ్డారు. హన్మకొండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక సంఘాల డిమాండ్లను పూర్తిగా పట్టించుకోకుండా, కేబినెట్ సబ్ కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వేతనాల పెంపులో అన్ స్కిల్డ్ వర్కర్లకు తప్ప, మిగిలిన స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కార్మికులకు పెద్దగా ప్రయోజనం లేదని వివరించారు. జీవో 4 ప్రకారం గతంలో స్కిల్డ్ కార్మికుడికి రూ.19,572 వేతనం ఉండగా, ఇప్పుడు ప్రకటించిన రూ.18,500 వల్ల సుమారు రూ.1,072 తగ్గినట్లు అయిందని ఆయన లెక్కలతో సహా వెల్లడించారు. కాంట్రాక్ట్ లేబర్ జీవో 11 ప్రకారం ఇప్పటికే కార్మికులు రూ.13,098 నుంచి రూ.23,683 వరకు పొందుతున్నారని, ప్రభుత్వం ఇప్పుడు పెంచిన జీతాలు వాస్తవానికి అదనంగా ఏమీ లేవని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ స్కిల్డ్ కార్మికుడికి కనీస వేతనం రూ.18,009 కి సిఫార్సు చేశామని, అలాగే మున్సిపల్ కార్మికుల వేతనాలను రూ.14,600 నుంచి రూ.22,000 కు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

హామీలను గాలికి వదిలేశారు
ఎన్నికల మేనిఫెస్టోలో కనీస వేతనం రూ.24,000 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చిందని దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. డాక్టర్ అట్రాయి ఫార్ములా ప్రకారం నెలకు కనీసం రూ.32,000 వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెబుతున్నా, కార్మిక సంఘాలు రూ.26,000 డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నామమాత్రపు పెంపుతో సరిపెట్టిందని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, సర్వశిక్షా అభియాన్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300000 మంది స్కీమ్ వర్కర్లను ఏ కేటగిరీలో చేరుస్తారో ప్రభుత్వం ఎక్కడా స్పష్టం చేయడం లేదని దాస్యం వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. ప్రభుత్వం వారి భవిష్యత్తును పూర్తిగా అంధకారంలోకి నెట్టేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

పునఃసమీక్షించాల్సిందే
ప్రస్తుతం అందుతున్న వేతనాల కంటే తక్కువగా ఉన్న ఈ సవరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునఃసమీక్షించాలని దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. కార్మికులకు అన్యాయం జరగకుండా శాస్త్రీయంగా వేతనాలు పెంచాలని, లేనిపక్షంలో కార్మికుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.