epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఫ్యాషన్‌గా మొదలై వ్యసనంగా మారుతున్న పొగాకు

ఫ్యాషన్‌గా మొదలై వ్యసనంగా మారుతున్న పొగాకు

గుండె జబ్బులు, క్యాన్సర్‌కు పొగాకే ప్రధాన కారణం

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంలో వైద్యుల అవగాహన

కాకతీయ, కరీంనగర్ : పొగాకు వినియోగం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన కారణాల్లో ఒకటని వైద్యులు పేర్కొన్నారు. పొగాకు అలవాటు వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యానికీ ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కరీంనగర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.కార్డియాలజిస్టు డాక్టర్ అనీష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ బీడీ, సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, శ్వాసకోశ సమస్యలు అధికమవుతున్నాయని తెలిపారు. పొగాకు కారణంగా రక్తనాళాలు దెబ్బతిని గుండెపోటు, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని వివరించారు.
ప్రస్తుతం పొగాకు ఉత్పత్తులను యువతను ఆకర్షించేలా వివిధ రుచులు, ఆకర్షణీయ ప్యాకింగ్‌తో మార్కెట్లోకి తీసుకురావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. సరదాగా మొదలయ్యే అలవాటు క్రమంగా వ్యసనంగా మారి ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పారు.
పొగతాగే వ్యక్తి మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్నవారు కూడా పరోక్షంగా నష్టపోతారని వైద్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు, గర్భిణులు సెకండ్ హ్యాండ్ స్మోక్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, అలెర్జీలు, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే అవకాశముందని వివరించారు.నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో అధిక శాతం పొగాకు వినియోగంతోనే సంబంధం ఉందని తెలిపారు. బీడీ తయారీ రంగంలో పనిచేసే కార్మికుల్లో కూడా ఆరోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు లొంగకుండా ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, మార్కెటింగ్ విభాగం ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.