epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్యమకారులకు  సమాజం అండగా నిలవాలి

ఉద్యమకారులకు  సమాజం అండగా నిలవాలి
రాజకీయాలకు అతీతంగా నిజమైన పోరాట యోధులను గుర్తించాలి
ఇచ్చిన హామీని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలి
ఐకాస కన్వీనర్ గోధుమల కుమారస్వామి
హనుమకొండలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తూ సంఘీభావ ర్యాలీ
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగపూరిత పోరాటాలు చేసిన ఉద్యమకారులకు తెలంగాణ సమాజం అండగా నిలవాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ గోధుమల కుమారస్వామి పిలుపునిచ్చారు. ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీని స్వాగతిస్తూ.. హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఏకశిల పార్క్ టానూ నాయక్ విగ్రహం నుండి అమరవీరుల స్థూపం, అంబేద్కర్ చౌరస్తా వరకు ఆదివారం భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కుమారస్వామి మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాల ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారన్నారు. మలిదశ ఉద్యమం వల్ల రాష్ట్రంలోని రాజకీయ పార్టీల బడా నాయకులు, అధికారులు, పెద్ద వ్యాపారస్థులు బాగుపడ్డారు తప్ప.. విలువైన ప్రాణాలు, సమయాన్ని కోల్పోయి పోరాడిన నిఖార్సైన ఉద్యమకారులు మాత్రం కనీస గుర్తింపునకు నోచుకోక అన్యాయానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
హామీ ఇచ్చి రెండున్నరేళ్లు దాటింది..
గత బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులకు తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని, ప్రతి ఒక్కరికీ 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ హామీ ఇచ్చిందని కుమారస్వామి గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు గడిచిన తర్వాతనైనా గుర్తింపు కోసం కమిటీని వేయడం అభినందనీయమన్నారు. అయితే ఇకనైనా తాత్సార్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని అమలు చేసి, బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐక్య పోరాటాల ద్వారానే ఉద్యమకారులు తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
రాజకీయ నాయకులతో కమిటీ వద్దు
ఈ సందర్భంగా ఐకాస రాష్ట్ర కో కన్వీనర్ సాధం రాజన్న మాట్లాడుతూ.. తెలంగాణ కోసం నాడు వీధిన పడి కొట్లాడిన ఉద్యమకారులు, నేడు తమ హక్కుల కోసం మళ్లీ పోరాడాల్సిన పరిస్థితి రావడం విచారకరమన్నారు. కమిటీ కాలయాపన చేయకుండా నిజమైన ఉద్యమకారులను గుర్తించి తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అన్ని ప్రభుత్వ పథకాలలో వారికి మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ మాట్లాడుతూ.. కమిటీ విధివిధానాలను వెంటనే ప్రకటించాలన్నారు. సీనియర్ ఉద్యమకారులు లేకుండా కేవలం రాజకీయ నాయకులతోనే కమిటీలు వేస్తే.. అది పార్టీల మధ్య గొడవలకు దారి తీస్తుంది తప్ప ఉద్యమకారులకు న్యాయం జరగదన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాకు ఒక కమిటీ వేసి, ఆయా రంగాల్లో ఉద్యమించిన వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తే గౌరవంగా ఉంటుందని సూచించారు. ఈ భారీ ర్యాలీలో వివిధ సంఘాల నాయకులు జైసింగ్ రాథోడ్, భట్టు రాజేందర్, నవరత్న ఆనంద్, సయ్యద్ గౌస్, చాపర్తి కుమార్ గాడ్గే, జన్ను పద్మ, ఎదునూరి రాజమౌళి, కూకట్ల విజ‌య్‌, జల్లెల కృష్ణమూర్తి, కొడపాక దేవి, డోలక్ యాదగిరి, రామగిరి బిక్షపతి, సమ్మయ్య రాథోడ్, రజనీ కాంత్, సురాసి విక్రమ్, తాడిశెట్టి క్రాంతి కుమార్, శోభ, జుబేర్, నయీం, ఠాకూర్ మోతీ సింగ్, దొమ్మాటి రవీందర్, అయిషా నస్రీన్, షేక్ అక్రమ్, మంద వీరస్వామి, పొడేటి ప్రశాంత్, చిలువేరు రామచంద్రం, సుధమల్ల అశోక్, గురిమిల్ల రాజు, రుద్రోజు నవీన్, ముకుందాచారి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.