epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రతి ఇంటా మొక్కలు.. ప్రతి గ్రామం పచ్చదనం

ప్రతి ఇంటా మొక్కలు.. ప్రతి గ్రామం పచ్చదనం
ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి పిలుపు
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన
ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యానికి పిలుపు

కాకతీయ, గీసుగొండ : వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఇల్లాలు తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని ఎంపీడీఓ వెన్న కృష్ణవేణి పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కోసం ప్రజలంతా భాగస్వాములు కావాలని సూచించారు. మండలంలోని బొడ్డు చింతలపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్–2026పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన ఎంపీడీఓ, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి కుటుంబం బాధ్యత తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రత్యేక గ్రామసభల్లో భాగంగా గీసుగొండ మండలంలోని 21 గ్రామాల్లో ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో నాలుగు విడతలుగా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎంపీడీఓ తెలిపారు. బుధవారంతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయని చెప్పారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక అధికారులు పాల్గొని గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు.

చెత్త వేరు చేసి అందించాలి

బొడ్డు చింతలపల్లి సర్పంచ్ పోగుల వనిత మాట్లాడుతూ మొక్కల పెంపకం మానవ మనుగడకు ప్రాణాధారమని అన్నారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్య కార్మికులకు అందించాలని సూచించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామంలోని డంపింగ్ యార్డును సందర్శించి కంపోస్ట్ ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించారు. శాయంపేట హవేలీలో తహసీల్దార్ ఎం.డి. రియాజుద్దీన్, వంచనగిరిలో వ్యవసాయ అధికారి హరి ప్రసాద్ బాబు, ఊకల్ హవేలీలో ఎంపీఓ పాక శ్రీనివాస్ పాల్గొని ప్రగతి ప్రణాళిక పనులను పర్యవేక్షించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు పోగుల వనిత, కక్కెర్ల సుభాష్, గాలి యాకయ్య, కొమ్ముల కోమల, పంచాయతీ కార్యదర్శులు ఆనంద్, సుధాకర్, రజిత, సునీల్, అనిల్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.