epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మోదీ పాలనలో విశ్వ‌గురువుగా భారత్

మోదీ పాలనలో విశ్వ‌గురువుగా భారత్
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం ఆవిర్భావం
రక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లో విప్లవాత్మక మార్పులు
‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి
సంక్షేమ పథకాలతో పేదలకు, రైతులకు నేరుగా లబ్ధి
అవినీతి రహిత పాలనతో దేశ కీర్తిని దశదిశలా చాటిన మోదీ
బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, నరెడ్ల ప్రవీణ్ రెడ్డి
కాకతీయ, పెద్దపల్లి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించిందని, భారత్ నేడు విశ్వగురువుగా ఎదిగిందని బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి బీజేపీ జిల్లా కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014లో అవినీతి, విధానపరమైన స్థబ్ధతతో సతమతమైన దేశాన్ని, నేడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని సురేష్ రెడ్డి అన్నారు. త్వరలోనే భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలతో యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని, రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా భారత్ ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుందని వివరించారు.
మౌలిక వసతుల్లో విప్లవాత్మక మార్పులు
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, వందేభారత్ రైళ్లు, విమానాశ్రయాల విస్తరణతో మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు. పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా పేదలకు, రైతులకు, మహిళలకు నేరుగా లబ్ధి చేకూరుతోందని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా అవినీతికి తావులేకుండా ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని వారు వివరించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారతీయుల శతాబ్దాల ఆకాంక్షను నెరవేర్చిందని, అంతరిక్ష రంగంలో చంద్రయాన్, గగన్‌యాన్ వంటి విజయాలు భారత్ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశాయని వారు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని వారు కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కన్వీనర్ శివంగారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు అమరాగాని ప్రదీప్ కుమార్, దాడి సంతోష్, కందుల శ్రీనివాస్, బెజ్జంకి దిలీప్, రామగిరి అఖిల్, బుతాగడ్డ రాజ్ కుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.