తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ గనిలో పర్యావరణ తనిఖీలు
కేంద్ర పర్యావరణ శాఖ అధికారి డాక్టర్ ఎం.టి. కరుప్పయ్య పర్యవేక్షణ
కాకతీయ, మలహర్ : తాడిచర్ల-1 ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిలో పర్యావరణ అనుమతుల నిబంధనల అమలును కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ అధికారి డాక్టర్ ఎం.టి. కరుప్పయ్య రెండు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించారు. గనిలో చేపడుతున్న దుమ్ము నియంత్రణ చర్యలు, గాలి-నీటి నాణ్యత పర్యవేక్షణ, హరితహారం, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. గని యాజమాన్యం సమర్పించిన పునరావాస కార్యక్రమాలు, భూసార పరిరక్షణ, సామాజిక బాధ్యత పనుల నివేదికలను మరియు సంబంధిత రికార్డులను అధికారి సమీక్షించారు. తనిఖీ అనంతరం తన పరిశీలనల ఆధారంగా సమగ్ర నివేదికను కేంద్ర మంత్రిత్వ శాఖకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జెన్‌కో జనరల్ మేనేజర్ పి. మోహన్ రావు, ఈఈ (సివిల్) తాఫిల్ అహ్మద్, గని యాజమాన్యం తరఫున సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీ. శ్రీధర్, ప్రాజెక్ట్ హెడ్ ఎ. ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె.ఎన్. మూర్తి, మైన్ మేనేజర్ జి. శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ కె. సురేష్ బాబు, పర్యావరణ అధికారులు రామ్ కుమార్, అభిషేక్, సర్వే డీజీఎం ఎం. సత్యమూర్తి, ప్రాజెక్ట్ ఇంజనీర్ కేశన్, హెచ్‌ఆర్ డీజీఎం రమేష్ బాబు పాల్గొన్నారు.

