epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఓట్ల తొల‌గింపున‌కు కేంద్రం కుట్ర

ఓట్ల తొల‌గింపున‌కు కేంద్రం కుట్ర
అపారదర్శకంగా ఎస్ఐఆర్ ప్రక్రియ
బీజేపీకి తొత్తుగా కేంద్ర ఎన్నికల కమిషన్
బీజేపీ చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మ
21 నుంచి మీనాక్షి నటరాజన్‌తో కలిసి నియోజకవర్గాల్లో పర్యటిస్తా
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్ల‌డి

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతతత్వ రాజకీయాలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని, ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో నిర్వ‌హించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందన్నారు. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ ఓట్ల గల్లంతుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
2002లో పారదర్శకంగా జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ఇప్పుడు అపారదర్శకంగా సాగుతోందని మహేష్ గౌడ్ విమర్శించారు. “ఎస్ఐఆర్ ప్రక్రియలో నా ఓటు, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డిల ఓట్లు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. దీన్ని అడ్డుకోవాలంటే బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన పిలుపునిచ్చారు. 21 నుంచి మీనాక్షి నటరాజన్‌తో కలిసి తాను నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, 21న మక్తల్, 23న ఆందోల్ నియోజకవర్గాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

మోడీ, అమిత్ షాలకు హెచ్చరిక
రాజకీయాల్లో చక్రవర్తుల్లా ఉండాలని భావించే మోదీ, అమిత్ షాల అహంకారం త్వరలోనే నేలమట్టం అవుతుందని మహేష్ గౌడ్ జోస్యం చెప్పారు. “దేవుడి పేరు చెప్పుకోకుండా బీజేపీకి ఓట్లు పడవు. జై శ్రీరామ్ అనడం అందరికీ తెలుసు. జగ్గారెడ్డి నిత్యం పూజలు చేస్తారు, కానీ మేం దేవుడి పేరుతో ఓట్లు అడగం” అని స్పష్టం చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ, ఉన్న ఉద్యోగాలను కూడా తీసేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. ఆయన వెనుక బీజేపీ ఉందని, ఆ పార్టీ ఆడించినట్లు పవన్ ఆడుతున్నారని విమర్శించారు. “మీ సానుభూతి మాకు అక్కర్లేదు, మీ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు” అని ఘాటుగా సమాధానమిచ్చారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆయన కౌంటర్ ఇచ్చారు. “గత 12 ఏళ్లలో మీరు రాష్ట్రానికి ఏం చేశారో చిట్టా ఇవ్వండి? సబర్మతికి నిధులు ఇస్తారు, మూసీ ప్రక్షాళన కోసం ఇవ్వరా? విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు?” అని నిలదీశారు.

కాంగ్రెస్ పాలన – అభివృద్ధి
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 80 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రైవేట్ ఆస్పత్రులు బాగుపడితే, తమ ప్రభుత్వంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మహేష్ గౌడ్ ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.