epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేటీఆర్‌కు ఇంకా జ్ఞానోదయం కాలేదు

కేటీఆర్‌కు ఇంకా జ్ఞానోదయం కాలేదు
ఎన్నిక‌ల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార‌లేదు
కాంగ్రెస్‌ను దూషించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సమ్మేళనాలు
ఫామ్‌హౌస్ రైడ్‌పై ఎమ్మెల్సీ పోచంపల్లి జవాబు చెప్పాలి
టెక్స్‌టైల్ పార్క్ బిల్లులు ఎగ్గొట్టిన చ‌రిత్ర గులాబీ పార్టీది
కాంగ్రెస్ చేస్తున్న‌ అభివృద్ధిపై మాట్లాడే క‌నీస‌ అర్హత లేదు
పరకాలలో రౌడీయిజానికి తావు లేదు : ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

కాకతీయ, పరకాల : గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి ఓడించినప్పటికీ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇంకా బుద్ధి రాలేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం పరకాల నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి, కేవలం కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వ నాయకులను దూషించడానికే బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు.

తప్పులు కప్పిపుచ్చుకునేందుకే తిట్ల పురాణం

బీఆర్ఎస్ నాయకుల తిట్ల పురాణం, అబద్ధాల ప్రచారం అంతా వారి పదేళ్ల పాలనలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికేనని రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను, రైతులను ఘోరంగా మోసం చేసిందని, మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పులను చెల్లిస్తూనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గాడిలో పెడుతోందన్నారు. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోవాలంటే ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలని సూచించారు.

ఫామ్‌హౌస్ రైడ్‌పై సమాధానం చెప్పాలి

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేసే ముందు, ఇటీవల ఫామ్‌హౌస్ రైడ్‌పై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన వివరణ ఇవ్వాలన్నారు. అలాగే, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో టెక్స్‌టైల్ పార్క్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టారని, తాను ఎమ్మెల్యే అయ్యాక ప్రత్యేక చొరవ తీసుకుని బిల్లులు ఇప్పించి పనులను వేగవంతం చేశానని స్పష్టం చేశారు.

పరకాలలో రౌడీయిజానికి స్థానం లేదు

తాను డబ్బులతో కాకుండా ప్రజల నమ్మకంతో గెలిచానని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో రౌడీయిజానికి, బెదిరింపుల రాజకీయాలకు తావు లేదని హెచ్చరించారు. ప్రజలు ప్రశాంతంగా జీవించే వాతావరణాన్ని కల్పించడమే తన నిబద్ధత అని, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.