epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కుడా ప్లాట్ల వేలంలో భారీ అవినీతి

కుడా ప్లాట్ల వేలంలో భారీ అవినీతి
వేలాన్ని రద్దు చేసి సీబీఐ విచారణ జరపాలి
ఆఫ్‌లైన్ వేలం వెనుక రూ. 50 కోట్ల క్విడ్ ప్రోకో
సిండికేట్‌గా మారి ప్రభుత్వ ఖజానాకు గండి
కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి
ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలా? : మాజీ ఎమ్మెల్యే, దాస్యం విన‌య్‌భాస్క‌ర్‌

కాకతీయ, వరంగల్ బ్యూరో : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ప్లాట్ల వేలంలో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దల నీడలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, తక్షణమే ఆ వేలాన్ని రద్దు చేసి సీబీఐతో పాటు ప్రభుత్వ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్కీ లక నేతలు డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కుడా భూముల వేలం ప్రక్రియలో లోపాలు, అక్ర‌మాలు జ‌రిగాయంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి అంశంలో ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీల అమలును పూర్తిగా విస్మరించిందన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి కీలకంగా ఉండాల్సిన కుడా సంస్థను ప్రస్తుతం అవినీతికి అడ్డాగా మార్చారని, అధికారులు సైతం అక్రమాలకు సహకరించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రపంచమంతా పారదర్శకత కోసం ఆన్‌లైన్ ఈ-వేలం విధానాన్ని అనుసరిస్తుంటే, కుడా ప్లాట్ల వేలాన్ని ఉద్దేశపూర్వకంగా ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ప్రతిపక్షాలపై కేసులు, దాడులు, ఇళ్ల కూల్చివేతలు, బెదిరింపులు మానేసి మిగిలిన కాలంలోనైనా ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. అలాగే, యాదవ్ నగర్, రెడ్డిపురం మార్గంలోని చెరువును నిబంధనలకు విరుద్ధంగా పూడ్చివేస్తూ వాల్టా చట్టం, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు.

సిండికేట్‌గా మారి ప్రభుత్వ ఖజానాకు గండి
కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 21న కుడా నిర్వహించిన ప్లాట్ల వేలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు. బహిరంగ మార్కెట్‌లో గజం ధర రూ. 1.30 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు పలుకుతుంటే, వేలంలో మాత్రం కేవలం రూ. 66 వేల నుండి రూ. 69 వేలకే విక్రయించడం వెనుక కోట్ల రూపాయల చేతులు మారాయని ఆరోపించారు. కేవలం 11 నుండి 13 మంది మాత్రమే వేలంలో పాల్గొనేలా చూసి, మిగిలిన వారిని అడ్డుకున్నారన్నారు. కొందరు అధికార పార్టీ నేతలు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరలకే ప్లాట్లు దక్కించుకోవడం వల్ల కుడా ఖజానాకు సుమారు రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని లెక్కలతో వివరించారు. గతంలో బహిరంగ ప్రాంగణంలో నిర్వహించే వేలాన్ని, ఈసారి కార్యాలయం లోపల రహస్యంగా నిర్వహించడంపై చైర్మన్, వైస్ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ‘క్విడ్ ప్రోకో’ వ్యవహారంపై విచారణ జరిపి నిందితులను శిక్షించకపోతే, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, మాజీ మైనార్టీ కమిషన్ సభ్యుడు దర్శన్ సింగ్, మాజీ కార్పొరేటర్లు సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్, కుసుమ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.